Advertisement
వేరే ప్రాజెక్ట్స్ లో ఉండి డేట్స్ కుదరక, కథలపై నమ్మకం లేక సినిమాలను రిజెక్ట్ చేస్తుంటారు నటీనటులు.. కానీ తాము రిజెక్ట్ చేసిన సినిమాలు హిట్ అయితే వారి నమ్మకం కరెక్ట్ కాదని, మిస్ చేసుకున్నందుకు ఫీలవుతుంటారు..అలా మన హీరోలు రిజెక్ట్ చేసుకున్న హిట్ సినిమాల లిస్ట్ ఏంటో చూడండి..
ఎన్టీయార్
NTR రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్ చాలా పెద్దది..సుమారు తొమ్మిది సినిమాల వరకు రిజెక్ట్ చేశాడు యంగ్ టైగర్..అవన్ని సూపర్ హిట్సే..శ్రీమంతుడు,దిల్, కృష్ణ,రాజా ది గ్రేట్,ఊపిరి,అతనొక్కడే ,కిక్,ఆర్య, భద్ర.. ఒకవేళ యంగ్ టైగర్ ఈ సినిమాలు చేసుంటే ఎలా ఉండేదో???వీటిల్లో ఎక్కువ సినిమాలు రవితేజ ఖాతాలో చేరి హిట్ అందుకున్నాయి..
Advertisements
ప్రభాస్
జక్కన్న దర్శకత్వంలో వచ్చిన బాహుబలి ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు ప్రభాస్..కానీ మొదట్లో రాజమౌలి దర్శకత్వంపై నమ్మకంలేక సింహాద్రి సినిమాను రిజెక్ట్ చేశాడట ప్రభాస్..ఆ మేకింగ్ , సినిమా హిట్ తో తన మనసు మార్చుకుని ఇద్దరు ఛత్రపతి చేశారు..ప్రభాస్ కెరీర్లో మొదటి బిగ్గెస్ట్ హిట్ ఛత్రపతి..సుకుమార్ తొలి చిత్రం ఆర్యా కూడా ప్రభాస్ రిజెక్టెడ్ మూవీస్ లిస్ట్లో ఒకటి.
అల్లు అర్జున్
పండగ చేస్కో, 100%లవ్ అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు..100% లవ్ సినిమా మొదట్లో ప్లాప్ టాక్ తెచ్చుకుంది..అప్పుడు అందరూ అల్లు అర్జున్ చేసుంటే బాగుండేది అనే అభిప్రాయం వెలిబుచ్చారు..కానీ అప్పటికే బద్రీనాధ్ ఒప్పుకోవడం వల్ల ఈ సినిమాను రిజెక్ట్ చేయాల్సొచ్చింది.. పండగచేస్కో సినిమా రామ్ కి వెళ్లిపోయింది.
పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ రిజెక్ట్ చేసిన సినిమాలు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు,ఇడియట్,అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి,మిరపకాయ్, అతడు, పోకిరి..ఈ సినిమాలన్ని చేసుంటే పవన్ లెవెల్ వేరేలా ఉండేదేమో..ఏదేమైనా హిట్స్ తో సంబంధం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్..అతడు, మిరపకాయ్ సినిమాలను రిజెక్ట్ చేసినందుకు పవన్ బాధపడ్డాడు.మిరపకాయ్ దర్శకుడు హరీష్ శంకర్ తో గబ్బర్ సింగ్ ప్రాజెక్ట్ చేసి హిట్ కొట్టాడు.
Advertisement
మహేశ్ బాబు
ఫిదా, ఏం మాయ చేశావే,రుద్రమదేవి, 24 సినిమాలను మహేశ్ బాబు రిజెక్ట్ చేశారు..చైతూ,వరుణ్ తేజ్ ల కెరీర్ లో ఏం మాయ చేశావే, ఫిధా బిగ్గెస్ట్ హిట్స్..మహేశ్ కి డేట్స్ కుదరక ఫిదా ని రిజెక్ట్ చేశాడని సమాచారం..ఇక రుద్రమదేవిలో గోన గన్నారెడ్డి పాత్రకి తాను సూట్ కానని ఆ సినిమాని రిజెక్ట్ చేశాడట. నాని, 1 నేనొక్కడినే లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు తీసే మహేశ్ 24 ఎందుకు రిజెక్ట్ చేశాడో??
సూర్య
బిజినెస్ మాన్ సినిమాకు మొదట సూర్యనే సెలక్ట్ చేశారు పూరిజగన్నాద్..కానీ డేట్స్ కుదరక సూర్య స్థానంలో మహేశ్ ని తీసుకున్నారు..రాజమౌళి సినిమాను కూడా రిజెక్ట్ చేశాడు సూర్య. కానీ అది ఎంతటి పెద్ద తప్పిదమో తర్వాత అర్దం చేసుకున్నాడు..ఇదే విషయాన్ని సికిందర్ ఆడియో లాంచ్ లో బహిరంగంగా ఒప్పుకుని రాజమౌళికి క్షమాపణలు చెప్పాడు..
రాంచరణ్
హిట్ అయ్యే ఛాన్స్ లేదని ఎటో వెళ్లిపోయింది మనసు ని రిజెక్ట్ చేశాడు చెర్రీ..మణిరత్నం సినిమాలు అవార్డ్స్ వస్తాయి తప్ప, కమర్షియల్ గా సక్సెస్ కావు అనే కారణంతో OK బంగారం సినిమాను రిజెక్ట్ చేశాడు..అనూహ్యంగా OK బంగారం సినిమా కమర్షియల్ గా కూడా హిట్ అయింది.
మంచు మనోజ్
మనోజ్ కెరీర్లో మంచి సినిమాలు ఉన్నప్పటికి రావలసినంత పేరు మాత్రం రాలేదు.. మనోజ్ వదులుకున్న చిత్రం రచ్చ..ఈ సినిమాలో రాంచరణ్ నటించాడు..
వరుణ్ సందేశ్
హ్యాపీడేస్, కొత్తబంగారులోకం సినిమాల హిట్ తో చిన్నవయసులో స్టార్ డమ్ చూసి..తర్వాత వరుస ప్లాప్ లతో సినిమాలకు దూరం అయ్యడు వరుణ్ సందేశ్..ఇటీవల బిగ్ బాస్ ప్రోగ్రామ్ తో మళ్లీ తెరమీదకొచ్చాడు. సినిమా కథల ఎంపిక తెలియక పోవడం వల్ల వరుణ్ వదిలేసుకున్న సూపర్ హిట్స్ 100%లవ్, గుండె జారి గల్లంతయిందే.. ఈ రెండు సినిమాలు చేసుంటే వరుణ్ కెరీర్ గ్రాఫ్ మరోలా ఉండేదేమో..
Advertisements