Advertisement
స్టార్ హీరోలు…తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేసే ముందు పక్కాగా ప్లాన్ చేసుకుంటారు. ఫస్ట్ సినిమా మిస్ ఫైర్ కాకుండా ఉండేలా జాగ్రత్తపడతారు. ఫస్ట్ సినిమాతోనే ఇమేజ్ బిల్డ్ అవుతుంది కాబట్టి…మ్యాగ్జిమమ్ మాస్ సినిమాలతోనే అప్ కమ్మింగ్ హీరోల ఈ ఇంట్రడ్యూజింగ్ లు ఉంటాయి. అలా తమ కొడుకులను ఒక సినిమాతో అనుకొని చివరి నిమిషంలో మనసు మార్చుకొని మరో సినిమాతో లాంచ్ చేశారు స్టార్ హీరోలు.! ఆ సినిమాలేవి…అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఇప్పుడు చూద్దాం!
1. రాంచరణ్:
మొదట చరణ్ ను రాజమౌళి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకున్నారు. కథ కూడా ఓకే అనుకున్నారు. కానీ లాస్ట్ మూవ్ మెంట్ లో మనసు మార్చుకున్న చిరు….మాస్ డైరెక్టర్ చేతిలో పడితే బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందనే ఉద్దేశంతో….. చరణ్ ను పూరీ చేతిలో పెట్టారు. అనుకున్నట్టుగానే పూరీ చిరుత పేరుతో చరణ్ ను ఇంట్రడ్యూస్ చేశారు.
సినిమా రిజల్ట్స్ : చిరుత ( హిట్)
Advertisements
2. అల్లు అర్జున్:
అల్లు అర్జున్ ను మొదటగా డైరెక్టర్ తేజ జయం సినిమాతో లాంచ్ చేయాలనుకున్నాడు. అల్లు అరవింద్ కూడా దానికి ఒకే చెప్పేసాడు. పబ్లిక్ గా కూడా అనౌన్స్ చేశారు . కానీ అనుకోని అనూహ్యంగా ఆ సినిమాకు నితిన్ ను కన్ఫామ్ చేసుకున్నారు. ఆ తర్వాత రాఘవేంద్రరావు గంగోత్రి సినిమాతో బన్నిని హీరోగా ఇంట్రడ్యూస్ చేశారు.
సినిమా రిజల్ట్స్ : గంగోత్రి ( హిట్)
4. నాగచైతన్య:
అప్పటికే మాస్ డైరెక్టర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న పూరీ జగన్నాథ్ సినిమాతో కొడుకు నాగ చైతన్య ని లాంచ్ చేయాలని డిసైడ్ అయ్యాడు నాగార్జున… పూరీ సైతం చైతూ కోసం ఓ గ్యాంగ్ కథను రెడీ చేసుకొని నాగ్ కు వినిపించాడు. కథనచ్చిన నాగ్ కథలో కొన్ని మార్పులు చెప్పగా….పూరీ దానికి ఒప్పుకోలేదు….దీంతో ఆ ప్రాజెక్ట్ అక్కడికే స్టాప్ అయ్యింది. వాసు వర్మ జోష్ సినిమాతో చైతూ ను ఇంట్రడ్యూస్ చేశాడు.
Advertisement
సినిమా రిజల్ట్స్ : జోష్ ( ప్లాప్ )
4. అఖిల్:
మనం సినిమాతో మంచి హిట్ ఇచ్చిన విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో చిన్న కొడుకు అఖిల్ ను ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకున్నాడు నాగార్జున…కానీ సడెన్ గా తన నిర్ణయాన్ని మార్చుకొని మాస్ డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్షన్ లో అఖిల్ అనే సినిమా పేరుతోనే అఖిల్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.
సినిమా రిజల్ట్స్ : అఖిల్ ( ప్లాప్ )
5 రామ్:
ప్రొడ్యూసర్ స్రవంతి రవి కిషోర్ యువ సేన సినిమా తెలుగు రైట్స్ ను తన తమ్ముడి కొడుకు రామ్ ను ఇంట్రడ్యూస్ చేయడం కోసం కొన్నాడు. కానీ దేవదాస్ ప్రాజెక్ట్ పనిమీద రవి కిషోర్ ఆఫీస్ కి వచ్చిన వై వి ఎస్ చౌదరి అక్కడ రామ్ యాక్టింగ్ చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ క్లిప్ చూసి తను దేవదాస్ సినిమాకి కరెక్ట్ అని భావించి . రామ్ ను తన దేవదాస్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.
సినిమా రిజల్ట్స్ : దేవదాస్ ( బ్లాక్ బస్టర్ )
6. వరుణ్ తేజ్:
మొదట నాగబాబు వరుణ్ తేజ్ ని క్రిష్ డైరెక్షన్లో ఇంట్రడ్యూస్ చేయాలి అనుకున్నాడు . స్టొరీ కూడా రెడీ చేసి చిరుకి చెప్తే మొదటి సినిమాలో ఇలాంటి కథతో లాంచ్ చేయడం కరెక్ట్ కాదని నాగబాబు కి చెప్పాడు . కట్ చేస్తే శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో ముకుందా సినిమాతో వరుణ్ తేజ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.
సినిమా రిజల్ట్స్ : ముకుందా ( ప్లాప్ )
Advertisements