Advertisement
కేవలం సినిమా, క్రికెట్ తదితర రంగాలకు చెందిన వారు మాత్రమే అధికంగా ఆదాయాన్ని సంపాదిస్తారని చాలా మంది అనుకుంటారు. నిజానికి అనేక రంగాలకు చెందిన వారు కూడా పెద్ద మొత్తంలో సంపాదిస్తుంటారు. కాకపోతే ఆ రంగంలో వారు నిపుణులు అయి ఉంటారు.. అంతే తేడా. ఇక అనేక ప్రధానమైన వృత్తుల్లో ఒకటైన లాయర్ వృత్తిలోనూ పలువురు అధిక మొత్తాన్నే సంపాదిస్తున్నారు. వారి వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే…
1. రామ్ జెఠ్మలానీ
ఈయన వయస్సు 93 ఏళ్లు. అయినప్పటికీ ఇప్పటికీ ఈయన లాయర్‌గా కొనసాగుతున్నారు. ఈయన కోర్టులో ఒక్కసారి కనిపిస్తే రూ.25 లక్షల ఫీజు తీసుకుంటారు. ప్రముఖ క్రిమినల్ లాయర్‌గా, అత్యంత అనుభవం, వయస్సు కలిగిన లాయర్‌గా కూడా ఈయన పేరుగాంచారు.
2. ఫాలి నారిమన్
న్యాయవ్యవస్థకు ఈయన అందించిన సేవలకు గాను ఈయన పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులను అందుకున్నారు. ఒక్క కేసు వాదిస్తే ఈయన రూ.8 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఫీజు తీసుకుంటారు.
Advertisements
3. కేకే వేణుగోపాల్
దేశంలోని పేరుగాంచిన లాయర్లలో ఈయన ఒకరు. ఈయనను గతంలో భూటాన్ ప్రభుత్వం తమ రాజ్యాంగాన్ని రాసేందుకు నియమించుకుంది. ఈయన ఒక్క కేసుకు రూ.5 లక్షల నుంచి రూ.7.50 లక్షల వరకు చార్జ్ చేస్తారు.
4. గోపాల్ సుబ్రమణియం
ఈయన సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టులలో లాయర్‌గా వాదిస్తారు. 2009 నుంచి 2011 వరకు సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా కూడా సేవలందించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఈయన ఒక్క కేసుకు రూ.5.50 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు తీసుకుంటారు.
5. చిదంబరం
Advertisement
యూపీఏ హయాంలో చిదంబరం ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఈయన కార్పొరేట్ లాయర్‌గా గుర్తింపు పొందారు. సుప్రీం కోర్టుతోపాటు పలు ఇతర హైకోర్టుల్లోనూ ఈయన లాయర్‌గా వాదిస్తారు.
6. హరీష్ సాల్వే
సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా పదవిలో ఈయన 9 ఏళ్లు కొనసాగారు. రిలయన్స్, ఐటీసీ, టాటా, వొడాఫోన్ వంటి ప్రముఖ కంపెనీలు ఈయన క్లయింట్లుగా ఉన్నాయి. ఈయన ఒక్క కేసుకు రూ.6 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు తీసుకుంటారు.
7. అభిషేక్ మను సింఘ్వీ
ఈయన 37 ఏళ్ల వయస్సులోనే అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేసి పేరుగాంచారు. ఒక్క కేసుకు ఈయన రూ.6 లక్షల నుంచి రూ.11 లక్షల వరకు తీసుకుంటారు.
8. సి.ఆర్యమ సుందరం
ఈయన ప్రస్తుతం బీసీసీఐ లీగల్ అడ్వయిజర్‌గా ఉన్నాయి. అలాగే అనిల్ అంబానీ వంటి ప్రముఖ వ్యక్తులకు లాయర్‌గా సేవలందిస్తున్నారు. ఒక్క కేసుకు ఈయన రూ.5.5 లక్షల నుంచి రూ.16.50 లక్షల వరకు చార్జ్ చేస్తారు.
9. సల్మాన్ ఖుర్షీద్
గతంలో ఈయన విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. ఒక్క కేసుకు రూ.5 లక్షల వరకు తీసుకుంటారు.
10. కేటీఎస్ తులసి
సుప్రీం కోర్టులో ఈయన ఫేమస్ సీనియర్ అడ్వకేట్‌గా ఉన్నారు. రాబర్ట్ వాద్రా వంటి ప్రముఖ వ్యక్తుల కేసులను ఈయన వాదిస్తారు. 1994 నుంచి క్రిమినల్ జస్టిస్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఉన్నారు. ఒక్క కేసుకు రూ.5 లక్షల ఫీజు తీసుకుంటారు.
Advertisements