Advertisement
World Wresting Entertainment దీన్నే షార్ట్‌కట్‌లో WWE అని కూడా పిలుస్తారు. దీని గురించి నిజంగా తెలియని వారుండరు. చిన్నా పెద్దా అందరూ WWE షోలను ఎంతగానో ఇష్టపడతారు. అందులో ఫైటింగ్‌లను చూస్తూ థ్రిల్లింగ్‌గా ఫీలవుతారు. అది ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే అని తెలిసినా.. ఆ షోకు ఇప్పటికీ ఆదరణ తగ్గడం లేదు. అయితే ఈ షోలో పాల్గొనే WWE స్టార్లు కూడా ఏటా పెద్ద మొత్తంలోనే పారితోషికాలను అందుకుంటారు. కొన్ని లక్షల డాలర్లను వారు వేతనాలుగా పొందుతారు.
WWE ప్రస్తుత సీఈవో, చైర్మన్ విన్స్ మక్‌మహోన్, ఆయన భార్య లిండా మెక్‌మహోన్‌లు ప్రస్తుతం WWE బాధ్యతలు చూస్తున్నారు. వీరు WWE స్టార్లకు భారీగా జీతాలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే 2019కి గాను చాలా మంది WWE స్టార్లు 7 అంకెల వేతనాన్ని పొందారు.
ప్రస్తుతం బ్రాక్ లెస్నర్ అనబడే WWE స్టార్ ఇతర స్టార్లందరి కన్నా అధిక మొత్తంలో పారితోషికాన్ని అందుకుంటున్నాడు. ఇతను 2019కి గాను 12 మిలియన్ డాలర్ల (దాదాపుగా రూ.89.91 కోట్లు)ను పొందాడు. కేవలం షోలో కనిపించినందుకే ఇతనికి 5 లక్షల డాలర్లు (దాదాపుగా రూ.3.74 కోట్లు) ఇస్తారు.
Advertisements
ఇక ఇప్పటి వరకు 16 సార్లు WWE వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన జాన్ సీనా ఒకప్పుడు ఏడాదికి 12 మిలియన్ డాలర్లు (దాదాపుగా రూ.89.91 కోట్లు) సంపాదించేవాడు. కానీ ఇప్పుడు ఇతను అందులో పార్ట్ టైమర్‌గా ఉన్నాడు. దీంతో జాన్ సీనా ప్రస్తుతం ఏడాదికి 8.5 మిలియన్ డాలర్లను (దాదాపుగా రూ.63.68 కోట్లు) సంపాదిస్తున్నాడు. ఒక షోకు ఇతను కూడా 5 లక్షల డాలర్లు (దాదాపుగా రూ.3.74 కోట్లు) సంపాదిస్తున్నాడు. అలాగే ఇతని పేరిట సాగే ఉత్పత్తుల అమ్మకాల ద్వారా ఇతనికి 5 శాతం కమిషన్ ఇస్తారు.
ఇక వీరే కాకుండా ఇతర WWE స్టార్లు కూడా ప్రస్తుతం మిలియన్ల డాలర్లను ఏటా ఆర్జిస్తున్నారు. వారి వివరాలు ఇవే..
2019 సంవత్సరానికి అధిక వేతనం అందుకున్న WWE స్టార్లలో మొదటి, రెండో స్థానాల్లో ఉన్న బ్రాక్ లెస్నార్, జాన్ సీనాల గురించి పైనే తెలుసుకున్నాం. వారి తరువాతి స్థానాల్లో ఉన్నవారి వివరాలు…
Advertisement
3. రోమన్ రెయిన్స్ – 5 మిలియన్ డాలర్లు (దాదాపుగా రూ.37.46 కోట్లు)
4. రాండీ ఓర్టన్ – 4.5 మిలియన్ డాలర్లు (రూ.33.71 కోట్లు)
5. ఏజే స్టయిల్స్ – 3.5 మిలియన్ డాలర్లు (రూ.26.22 కోట్లు)
6. సెల్ రోలిన్స్ – 3 మిలియన్ డాలర్లు (రూ.22.47 కోట్లు)
7. ది మిజ్ – 2.5 మిలియన్ డాలర్లు (రూ.18.73 కోట్లు)
8. ది అండర్ టేకర్ – 2.5 మిలియన్ డాలర్లు (రూ.18.73 కోట్లు)
9. డీన్ ఆంబ్రోస్ – 2 మిలియన్ డాలర్లు (రూ.14.98 కోట్లు)
10. కెవిన్ ఓవెన్స్ – 2 మిలియన్ డాలర్లు (రూ.14.98 కోట్లు)
Advertisements