Advertisement
సినిమా రిలీజ్ కంటే ముందే….సినిమాపై హోప్ ను పెంచేది., సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేది మ్యూజిక్కే! ఆల్బమ్ హిట్ అయితే చాలు సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చినట్టే…కొన్ని సందర్భాల్లో కేవలం ఒక్క పాటే జనాలను సినిమా థియేటర్ వరకు రప్పిస్తాయి! అందుకే సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ కు మంచి ప్రాధాన్యత ఉంటుంది! ప్రస్తుతం ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ రెమ్యునరేషన్ ఎంతుందో చూద్దాం ( అంచనా మాత్రమే)
1. దేవి శ్రీ ప్రసాద్
రాక్ స్టార్ దేవి…. గతంలో వరకు ఒక్క సినిమాకు రెండుకోట్ల లోపు తీసుకునేవాడట! ప్రస్తుతం ఆయన వర్క్ చేస్తున్న సినిమాలకు 3 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు సమాచారం! దేవి మ్యూజిక్ చేస్తే సినిమా 70 హిట్టే అనే నమ్మకముంది ఇండస్ట్రీలో…అందుకే కాసింత ఎక్కువైనా అతనికే అప్పజెబుతారు. దీనికి తోడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముందుండి మరీ ప్రోగ్రామ్ ను నడిపిస్తుంటాడు.!
2. ఎస్ ఎస్ థమన్
Advertisements
వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న థమన్ సినిమాకు కోటి తీసుకుంటున్నట్టు టాక్ . బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పై ఎక్కువగా ఆధారపడే సినిమాలకు మాత్రం బెస్ట్ ఛాయిస్ థమనే!
3. అనురుధ్ రవి చందర్
కొలెవరి సాంగ్ తో ప్రపంచాన్ని ఊపేసిన ఈ యంగ్ కంపోజర్ మొదటి సినిమాకు 5 లక్షలు తీసుకున్నాడు . ఇప్పుడు మనోడి రేటు 2 కోట్లు!
4 . ఏ ఆర్ రెహమాన్
వెయ్యి రూపాయల జీతంతో తన కెరియర్ ను స్టార్ట్ చేసాడు రెహమాన్ ప్రస్తుతం ఇండియాలోనే అత్యధిక పారితోషకం అందుకుంటున్న వారిలో మ్యూజిక్ డైరెక్టర్! సినిమా మార్కెట్ ని బట్టి 10 కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్నారు అని టాక్. ఈయన మ్యూజిక్ కోసం సినిమాలకు వచ్చే వాళ్లు కోకొల్లలు!
5. ఎమ్ ఎమ్ కీరవాణి
Advertisement
టాలీవుడ్ సీనియర్ మోస్ట్ కంపోజర్ కీరవాణి. కీరవాణి మ్యూజిక్ చేశాడంటే ఆ సినిమాలో ఒక్క పాటైనా వైరల్ అవ్వాల్సిందే! రాజమౌళి సినిమాలకు అదిరిపోయేలా మ్యూజిక్ అందించే కీరవాణి 1.5 కోటి వరకు అందుకుంటాడని సమాచారం.
6. మణిశర్మ
1990 లోనే ఒక పాటకు 90 వేల వరకు అందుకున్న ఏకైక మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ. అనంతరం ఈయన రేటు 50 లక్షల వరకు వెళ్లింది . కొన్ని సార్లు సినిమా బడ్జెట్ ని బట్టి పారితోషకం తీసుకునేవాడు . ఇక ఇష్మార్ట్ శంకర్ హిట్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన మణి రెమ్యునరేషన్ కూడా కోటి!
7. గోపి సుందర్
గీతాగోవిందం సాంగ్స్ తో మంచి హిట్ అందుకున్న ఈ కంపోజర్ రేట్ కూడా ఇప్పుడు 50 లక్షలు దాటించినట్లు సమాచారం .
8. అనూప్ రుబెన్స్:
అనూప్ రెమ్యునరేషన్ 40 లక్షల లోపు ఉన్నట్టు సమాచారం!
9. మిక్కిజె మేయర్:
హ్యాపీ డేస్ , లీడర్ , లైఫ్ ఐస్ బ్యూటీఫుల్ సినిమాలకు మ్యూజిక్ చేసిన మిక్కీ అప్పట్లో 40లక్షల వరకు తీసుకున్నాడట…మహానటి తర్వాత తన రేటు 70 లక్షలు చేశాడట!
10. జిబ్రాన్:
ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్పెషలిస్ట్ గా ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న టెక్నిషియన్స్ లో జిబ్రాన్ ఒకరు . ఇతను సినిమాకు 50 లక్షల వరకు తీసుకుంటున్నట్టు టాక్ .
Advertisements