Advertisement
కేంద్రప్రభుత్వం 59 చైనా యాప్లను నిషేదించిన విషయం తెలిసిందే..వాటిల్లో పెద్ద దెబ్బ పడింది టిక్ టాక్ పైనే..మన దేశంలో మిగతా చైనా యాప్స్ కంటే టిక్ టాక్ యూజ్ చేస్తున్న వాళ్ల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది..యాక్టింగ్ అవకాశాలు లేవని,రావట్లేదని బాధపడకుండా టిక్ టాక్ లో వీడియోలు చేసుకుంటూ లక్షల్లో ఫాలోవర్స్ ని పెంచుకుంటూ ఫేమస్ అయిన వాళ్లున్నారు..వాళ్లల్లో మన తెలుగు వాళ్లు కూడా అనేకమంది ఉన్నారు..వీళ్లంతా ఇప్పుడు టిక్ టాక్ ని బ్యాన్ చేయడంతో మరో ప్లాట్ ఫాంస్ ని వెదుక్కుంటున్నారు..టిక్ టాక్ లో వీడియోస్ ద్వారా ఫేమస్ అయిన కొంతమంది తెలుగు వారి గురించి చెప్పుకుందాం..
వర్షిణి :
Varshini bunnyvox పేరిట టిక్ టాక్స్ చేసే ఈ అమ్మాయి చూడడానికి కొంచెం రాశి ఖన్నా పోలికలుంటాయి.. సోలోగా, వికాస్ పండు అనే మరో టిక్ టాకర్ తో కలిసి చేసే డ్యూయెట్ వీడియోస్ కూడా బాగా ఫేమస్.. మోస్ట్ ఫేమస్ టిక్ టాకర్ అనగానే ఆల్మోస్ట్ అందరికి గుర్తొచ్చే పేరు వర్శిణి.. సినిమా హీరోయిన్స్ కి ధీటుగా అందం,ఎక్సప్రెషన్స్ తో దూసుకెళ్తున్న వర్శిణి ఫాలోవర్స్ సంఖ్య 2మిలియన్ ..
మెహబూబ్
Advertisements
ఎమోషన్స్ ని ఎక్స్ప్రెషన్స్ లో హ్యాండిల్ చేసే టిక్ టాకర్ లో మహబూబ్ ఒకటి..టిక్ టాక్ వీడియోస్ తో బాగా ఫేమస్ అయిన మహబూబ్..టిక్ టాక్ ఫ్లాట్ ఫాంపైనే మూవీ ప్రమోషన్స్ కూడా చేస్తుంటాడు
సలీమ్ ఖాన్
Vizagsmile పేరిట సలీమ్ ఖాన్ మరియు అతడి భార్య కలిసి చేసే వీడియోలు బాగా ఫేమస్..వీరి ఫాలోవర్స్ సంఖ్య కేవలం టిక్ టాక్ లోనే కాదు..ఇతర ఫ్లాట్ ఫాంస్లో కూడా వీరి వీడియోస్ చక్కర్లు కొడుతుంటాయి..భార్యాభర్తలిద్దరూ ఒకరిపై ఒకరు వేసుకునే పంచులు మనల్ని కడుపుబ్బా నవ్విస్తాయి.
ఈషా మనోహరి ప్రియ
వైజాగ్ కి చెందిన బక్క పిల్ల ఈషా.. ఒంట్లో కేజి కండ లేదు కానీ యాక్టింగ్ లో మాత్రం సూపర్..కాటుక కళ్లతో ఎమోషన్,కోపం,నవ్వు ఇలా అన్ని ఎక్స్ప్రెషన్స్ తో ఫాలోవర్స్ ని ఆకట్టుకుంటుంది.
ఫన్ బకెట్ భార్గవ :
ఫన్ బకెట్ భార్గవ అండ్ టీం వీడియోస్ కూడా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి.. ఓ మై గాడ్ ఓమై గాడ్ డైలాగ్ తో ఫేమస్ అయిన నిత్యా కేరాఫ్ కంచరపాలెం మూవీలో కూడా యాక్ట్ చేసింది..ఫన్ బకెట్ భార్గవ టింలో ఒక మెంబర్..
ఉప్పల్ బాలు
Advertisement
టిక్ టాక్ ఫేమ్ ఉప్పల్ బాలు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు..తన వీడియోలతో నవ్వించే ఉప్పల్ బాలూని తిడుతూ అయినా కూడా తన వీడియోస్ ఎంజాయ్ చేస్తుంటారు ఫాలోవర్స్..బ్యాడ్ కామెంట్స్ ని బాలు పట్టించుకోడు అది వేరే విషయం.
ప్రణవి మానుకొండ
బుల్లితెర నటి ప్రణవి మానుకొండ..టిక్ టాక్ లో బాగా ఫేమస్.. ఉయ్యాల జంపాల సినిమాలో అవికా గోర్ చిన్నప్పటి పాత్రలో కనిపించిన ప్రణవి మరికొన్ని సినిమాల్లో నటించింది.. ఇప్పుడు గంగ మంగ ఇతర సీరియల్స్ కూడా చేస్తూ.. ఇటు టిక్ టాక్లో కూడా ఫేమస్ అయింది.
దీపికా నరేశ్
మొదట్లో సరదాగా కూతురితో చిన్నచిన్న వీడియోలు చేసిన దీపికా ఇప్పుడు టిక్ టాక్ లో బాగా ఫేమస్..తన ఓన్ వాయిస్ తో వీడియోలు చేసి పెడుతుంటుంది..ఇప్పుడు ఫ్యామిలిఫ్యామిలి టిక్ టాక్ వీడియోస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు..వీరి ఫాలోవర్స్ సంఖ్య సుమారు ఐదున్నర లక్షల పైనే..
గీతు రాయల్..
రాయలసీమ యాసలో ఓన్ వాయిస్ తో టిక్ టాక్స్ చేస్తుంది గీతు రాయల్.. గీతు వీడియోస్ వాట్సప్ స్టాటస్లలో బాగా ఫేమస్..కొందరిని ముఖం మీద కొట్టినట్టుగా ఉంటాయి తన మాటలు.. అదేనండి టిక్ టాక్స్..అందుకే అందరికి బాగా నచ్చుతాయి..ముఖ్యంగా చాలామంది తమలోని ఫ్రస్ట్రేషన్ ని,కోపాన్ని గీతు వీడియోల రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తుంటారు..అమేజాన్లో సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా పనిచేస్తుంది గీతు ..
రేవతి రెడ్డి
టిక్ టాక్ లో తన పాటలతో కడుపుబ్బా నవ్వించడమే కాదు… ఇంతకీ తనేం పాట పాడిందో మనం తెలుసుకోవడానికే సగం జీవితం అయిపోతుంది..రేవతక్క పాడిన మబ్బుల్లోన వానవిల్లులా పాట బాగా ఫేమస్..
గుంట నాగరాజు
సామాన్యులని కూడా సెలబ్రిటిలను చేసిన టిక్ టాక్ లో..మరో ఫేమస్ ఆర్టిస్ట్ గుంట నాగరాజు..పేరడి పాటలతో ప్రేక్షకులను నవ్విస్తుంటాడు నాగరాజు.
వీళ్లు కొంతమంది టిక్ టాకర్స్ మాత్రమే… వీళ్లే కాకుండా వారివారి వీడియోస్ ద్వారా ఫేమస్ అయినవాళ్లు చాలామందే ఉన్నారు..వాళ్లంతా ఇప్పుడు టిక్ టాక్ బ్యాన్ చేసినందుకు బాధపడుతూనే..యూట్యూబ్,ఇన్స్టా లాంటి ఇతర ప్లాట్ ఫాంస్ వైపు షిప్ట్ అవుతున్నారు..
భాను :
ఫైనల్ గా టిక్ టాక్ టాపర్ భాను.! ఎక్స్ ప్రెషన్స్ లో తోపు. తెలుగు , హిందీ, ఇంగ్లీష్ …మూడు భాషల్లో వీడియోస్ మడతెట్టేసింది!
Advertisements