Advertisement
మనజీవితాల్లో సినిమాలది ప్రత్యేక స్థానం.. ఎంటర్టైన్మెంట్ అనగానే టక్కున గుర్తొచ్చేది సినిమానే..మూడుగంటల సినిమా చూస్తూ బయటి ప్రపంచాన్నే మర్చిపోతుంటాం.. సినిమాల్లో అందరిని ఎక్కువగా ఆకట్టుకునేది పంచ్ డైలాగ్స్.. డైలాగ్స్ విని వదిలేయకుండా వాటిని ఇమిటేట్ చేస్తుంటాం..బాగా ఫేమస్సై.. మన రొటీన్ లైప్ లో ఎక్కువగా వాడిన కొన్ని పంచ్ డైలాగ్స్ ఏంటో చూద్దామా…
1.ప్రపంచంలో తల్లిని మించిన యోధులు మరెవ్వరూలేరు..!
కెజిఎఫ్ సినిమాలో ప్రతి డైలాగ్ అధ్బుతమే..కానీ, “ప్రపంచంలో తల్లిని మించిన యోధులు మరెవ్వరూ లేరు” ఈ డైలాగ్ మోర్ స్పెషల్…అమ్మ గురించి ఇంతకన్నా గొప్పగా ఇంకేం చెప్పగలం..
2.నాకు కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది..!
Advertisements
గబ్బర్ సింగ్ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నోటి నుండి వచ్చిన ఈ డైలాగ్ కి విజిల్సే విజిల్స్.. తర్వాత అందరి లైఫ్లో ఈ డైలాగ్ ఒక పార్ట్ అయిపోయింది.. ఎవడేమన్నా వెంటనే “నాకు కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది” అనడం అలవాటైపోయింది.
3.ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు..!
పూరి,మహేశ్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ పోకిరి.. ఈ సినిమాతో మహేశ్ లోని మరో యాంగిల్ని చూపించాడు పూరి.. పోకిరిలో మహేశ్ చెప్పే డైలాగ్ “ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు..”ఈ డైలాగ్ ని మన పేర్లకు కూడా అన్వయించుకుని ఉపయోగించేస్తుంటాం..
4.ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్.. వందమందిని ఒకేసారి పంపించు..!
రాంచరణ్ కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్ మగధీర.. ఆ సినిమాలో డైలాగే “ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ ..వందమందిని ఒకేసారి పంపించు..” చెర్రీ చెప్పే ఈ డైలాగ్ బాగా హిట్ అయింది.
5.వీర శంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా!
చిరంజీవి నటించిన ఇంద్ర సినిమాలోని మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా.. మీమ్ మేకర్స్ కి దొరికిన ఒక అధ్బుతమైన డైలాగ్..
6.చూడు ఒక వైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు..!
డైలాగ్లంటే బాలయ్య.. బాలయ్య అంటే డైలాగ్స్ అన్నట్టుగా ఉంటాయి బాలకృష్ణగారి సినిమాలు..ఒకటి రెండు డైలాగులతో సరిపెట్టడం కష్టం..కాని వాటిల్లో మనం ఎక్కువగా ఉపయోగించిన డైలాగ్ “చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు..”
Advertisement
7.కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తా..!
బాలకృష్ణ మరో డైలాగ్ నరసింహ నాయుడు సినిమాలోని “ కత్తులతో కాదు , కంటి చూపుతో చంపేస్తా..”ఇరవై ఏళ్లయినా ఇప్పటికి ఈ డైలాగ్ లో పవర్ తగ్గలేదు.
8.ఇంకేం కావాలి..వీలైతే నాలుగు మాటలు,కుదిరితే కప్పు కాఫి..!
సిద్దు,జెనిలియా నటించిన బొమ్మరిల్లు సినిమాలోని ఇంకేం కావాలి, వీలైతే నాలుగు మాటలు ,కుదిరితే కప్పు కాఫి, ఈ డైలాగ్ అప్పట్లో అందరి రింగ్ టోన్ గా మారిపోయింది.
9.మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్..!
పూరి, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన సినిమా ఇద్దరమ్మయిలతో..సినిమా సోసో గా ఉన్నా.. మాటల్లేవ్..మాట్లాడుకోవడాల్లేవ్ డైలాగ్ మాత్రం సూపర్ హిట్ అయింది.
10.నువ్వు నా పక్కన ఉండగా నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలే మామా..!
బాహుబలి రెండు సినిమాలు ఒకెత్తు ఈ డైలాగ్ ఒకెత్తు.. నువ్వు నా పక్కన ఉండగా నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలే మామా.. ఈ డైలాగ్ తో వచ్చిన ప్రతి మీమ్ ఎంతో నవ్వించేవి.
11.భాషా, ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్టు..!
డైలాగ్స్ కి కేరాఫ్ అడ్రస్ రజినికాంత్.. ఆయన డైలాగుల గురించి రాయాల్సొస్తే స్పెషల్ ఆర్టికలే రాయాలి.. అందుకే బాగా ఫేమస్సైనా ఒక డైలాగ్ తో సరిపెట్టుకుందాం.. భాషా, ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్టు.. రజినికాంత్ ఈ ఒక్క డైలాగ్ చాలు..ఆయన వందడైలాగ్స్ మన మైండ్లోకి వచ్చేస్తాయి.
12.ఆశ క్యాన్సర్ ఉన్నోన్ని కూడా బతికిస్తుంది..భయం అల్సర్ ఉన్నవాన్ని కూడా చంపేస్తుంది..
జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెప్పే ఆశ క్యాన్సర్ ఉన్నోన్ని కూడా బతికిస్తుంది..భయం అల్సర్ ఉన్నవాన్ని కూడా చంపేస్తుంది.. బాగా హిట్ అయింది. ప్రస్తుతం మనం ఉన్న ప్యాండమిక్ సిట్యుయేషన్లో ఈ డైలాగ్ చాలా అవసరం..ఇవికాక ఇంకొన్ని ఉండొచ్చు …అన్నింటిని రాయలేము. కాబట్టి మీకు నచ్చిన డైలాగ్స్ ను కామెంట్స్ రూపంలో తెలియజేయండి!
Advertisements
దానవీర శూర కర్ణ సినిమాలోని…..ఏమంటివి, ఏమంటివి…? డైలాగ్ అయితే నభూతో నభవిష్యత్.!