Advertisement
కరోనా కారణంగా జనాలు ఇంటికే పరిమితమయ్యారు….దీంతో సహజంగానే మొబైల్ గేమింగ్ పై డైవర్ట్ అయ్యారు ….ఎంతగా అంటే గేమింగ్ కంపెనీ లు సైతం ఊహించనంతగా.! కొన్ని గేమ్స్ అయితే వాటిని విడుదల చేసినప్పటి నుండి లాక్ డౌన్ ముందు వరకు ఎన్ని డౌన్లోడ్స్ ఉండేవో…లాక్ డౌన్ పీరియడ్ లో అంతకు మించి డౌన్లోడ్స్ అయ్యాయి అంటే ఆలోచించొచ్చు కరోనా టైం ను మనోళ్లు గేమింగ్ తో ఎలా టైంపాస్ చేస్తున్నారో.
ఈ లాక్ డౌన్ పీరియడ్ లో జనాలు విపరీతంగా డౌన్లోడ్ చేసుకున్న 4. గేమ్స్
1 ) PUBG …..ఈ మధ్య కాలంలో ఈ పేరు వినని వాళ్ళు లేరేమో.! సాధారణంగా యూత్ ఎక్కువగా అదే ఈ ఆట…లాక్ డౌన్ కారణంగా ఇంటిల్లి పాది అదే గేమ్ గా మారిపోయింది. గ్రూప్ గా ఆడే ఆప్షన్ ఉండడంతో …అంతా ఓ టీం గా ఆడుకుంటూ టైం పాస్ చేసేస్తున్నారు. PUBG ను ఇప్పటివరకు 60 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారట.!
2 ) FREE FIRE .… PUBG ని పోలిన మరో ఆట..ఈ రెండు గేమ్స్ లో నామమాత్రపు తేడాలే ఉన్నప్పటికీ… PUBG తర్వాతి స్థానాన్ని ఈ గేమ్ ఆక్రమించింది.FREE FIRE ను ఇప్పటివరకు 45 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారట.!
Advertisement
Advertisements
3 ) లూడో….. మన అష్ట చమ్మ లాంటి ఆట అన్నమాట. ఆడడం చాల ఈజీ …మిడిల్ ఏజ్ గ్రూప్ వారు ఎక్కువగా ఇష్టపడే ఆట ఇది. దీనిని ఇప్పటివరకు 75. డౌన్లోడ్ చేసుకున్నారట.!
4 ) క్యారం పూల్ .… ఆన్లైన్ క్యారం బోర్డు ! మన ఫ్రెండ్స్ తో పోటీ పడే అవకాశం ఉండడంతో ఇది ఛాలెంజింగ్ గేమ్ గా మారిపోయింది. మనకున్న చిప్స్ తో ఇతరులతో పోటీ పడుతూ ఆడొచ్చు .
ఇంకా ఇవి కాకుండా …చాలా గేమ్స్ ఈ కరోనా కారణంగా ఎక్కువగా ఆడబడుతున్నాయి.
Advertisements
నోట్ : మొబైల్ గేమ్స్ ఎక్కువగా ఆడడం కళ్ళ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఏదో కాసేపు టైంపాస్ కి ఆడాలి అంతే కానీ …పొద్దస్తమానం దాని మీదే గడపడం మీ ప్రాణాలకే ప్రమాదం. PUBG వల్ల జరిగిన అనేక ఘటనల గురించి మీకు తెలిసే ఉంటుంది.