Advertisement
గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు.. నేటి తరుణంలో పట్టణాలు, నగర ప్రాంతాల్లోనూ అనేక మంది పాడి వ్యాపారంపై దృష్టి పెట్టారు. గేదెలను కొనుగోలు చేసి వాటి పాలను తీసి అమ్ముతూ స్వయం ఉపాధి పొందుతున్నారు. కొంచెం కష్టపడాలే గానీ ఈ వ్యాపారంలోనూ లాభాలు పొందవచ్చు. అయితే ఎక్కువ పాలను ఇచ్చే గేదెలను పెంచితే దాంతో ఎక్కువ మొత్తం లాభాలను పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో బాగా పాలిచ్చే టాప్ 7 దేశవాళీ గేదెలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ముర్రా
హర్యానాలోని రోహ్‌తక్, హిసార్, జింద్, పంజాబ్‌లోని నభా, పాటియాలా ప్రాంతాలు ఈ జాతి గేదెలకు పేరుగాంచాయి. ఈ గేదెల ధర సుమారుగా రూ.90వేల నుంచి రూ.1.20 లక్షల వరకు ఉంటుంది. ఒక్కో గేదె సుమారుగా 650 కిలోలకు పైగానే బరువుంటుంది. ఇవి నిత్యం సుమారుగా 10 నుంచి 16 లీటర్ల వరకు పాలిస్తాయి.
2. భదావరి
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లా భదావరి తాలూకా, ఈతావా జిల్లా, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాల్లో ఈ జాతి గేదెలు ఎక్కువగా ఉంటాయి. వీటి బరువు సుమారుగా 425 కిలోలకు పైగానే ఉంటుంది. వీటి ధర రూ.70వేల నుంచి ప్రారంభమవుతుంది. ఇవి నిత్యం సుమారుగా 18 లీటర్ల వరకు పాలిస్తాయి.
Advertisements
3. జఫరబది
గుజరాత్‌లోని కచ్, జునాగఢ్, జామ్‌నగర్ జిల్లాల్లో ఈ జాతి గేదెలు ఎక్కువగా ఉంటాయి. వీటి ధర కూడా సుమారుగా రూ.70వేల నుంచి ప్రారంభమవుతుంది. ఇవి కూడా నిత్యం 18 లీటర్ల వరకు పాలివ్వగలవు.
Advertisement
4. సుర్తి
గుజరాత్‌లోని కైరా, బరోడా జిల్లాల్లో ఈ గేదెలు లభిస్తాయి. తేలికపాటి పనుల కోసం కూడా ఈ గేదెలను వాడుతారు. వీటి బరువు సుమారుగా 400 కిలోలకు పైనే ఉంటుంది. వీటి ప్రారంభ ధర రూ.85వేల నుంచి ఉంటుంది. ఇవి నిత్యం 12 నుంచి 20 లీటర్ల వరకు పాలిస్తాయి.
5. మెహసానా
గుజరాత్‌లోని మెహసానా, సబర్, కంద, బనస్కంత ప్రాంతాల్లో ఈ గేదెలు లభిస్తాయి. వీటి ధర రూ.65వేల నుంచి ప్రారంభమవుతుంది. నిత్యం 14 లీటర్ల వరకు ఇవి పాలిస్తాయి.
6. నాగ్‌పురి
మహారాష్ట్రలోని నాగ్‌పూర్, అకోలా, అమరావతి జిల్లాల్లో ఈ గేదెలు లభిస్తాయి. వీటిని ఎలిచ్‌పురి, బురారి గేదెలు అని కూడా పిలుస్తారు. రూ.85వేల నుంచి వీటి ధర ప్రారంభమవుతుంది. ఈ గేదెలు నిత్యం 12 నుంచి 20 లీటర్ల వరకు పాలిస్తాయి.
7. నిలి-రవి
పంజాబ్‌లోని సట్లెజ్ లోయ, ఫెరోజ్‌పూర్ జిల్లాల్లో ఈ గేదెలు లభిస్తాయి. అలాగే ఒడిశాలోని నీలగిరి, పార్లక్‌మెడి, మహారాష్ట్రలోని పంధర్‌పురి, మరఠ్వాడా ప్రాంతాల్లోనూ వీటిని కొనవచ్చు. ఇవి 600 కిలోలకు పైగానే బరువుంటాయి. వీటి ధర రూ.85వేల నుంచి ప్రారంభమవుతుంది. రోజుకు 15 లీటర్ల పాలిస్తాయి.
Advertisements