Advertisement
సమాజంలో ఉన్న పేదలు, అనాథలు, వృద్ధులకు సహాయం అందించేందుకు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు వినూత్నమైన కార్యక్రమాలను నిర్వహిస్తుంటాయన్న సంగతి తెలిసిందే. అనేక కార్యక్రమాల ద్వారా ఆయా సంస్థలు డబ్బును సేకరించి వారి అవసరాల కోసం వినియోగిస్తుంటాయి. అలాంటి వారికి సహాయం చేస్తుంటాయి. అయితే కొన్ని సేవా సంస్థలు ఇందుకు గాను వెరైటీ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తాయి. ఇప్పుడు చెప్పబోయేది కూడా సరిగ్గా అలాంటి ఓ ప్రోగ్రామ్ గురించే.
పసుపు రంగులో ఉండే పిల్లలు ఆడుకునే బాతు బొమ్మల తెలుసు కదా. ఆ బొమ్మలు ఎంతో ముద్దుగా ఉంటాయి. చూడగానే ఆకట్టుకుంటాయి. అయితే వాటితో రేస్ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తుంటారు. ఇవి అనేక చోట్ల జరుగుతుంటాయి. వీటిని నిజానికి ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల ఫెస్టివల్స్ రూపంలో నిర్వహిస్తుంటారు.
Advertisement
కొన్ని వేల కొద్దీ అలాంటి బాతు బొమ్మలపై నంబర్లను వేస్తారు. ఒక్కో నంబర్ ఉన్న బాతు బొమ్మను ఒక్కొక్కరికి కేటాయిస్తారు. తరువాత ఆ బొమ్మలన్నింటినీ నదీ ప్రవాహంలో ఒక్కసారే వేస్తారు. దీంతో ఆ బొమ్మలు నీటిపై తేలుతూ ముందుకు సాగుతాయి. ఈ క్రమంలో రేస్ ప్రారంభమవుతుంది. అన్నింటికన్నా ముందుగా గమ్యస్థానానికి చేరుకున్న బాతుబొమ్మ గెలిచినట్లు. అంటే దానిపై వేసిన నంబర్ కలిగి ఉన్నవారు ఆ కాంపిటీషన్‌లో గెలిచినట్లు లెక్క. ఇక ఈ తరహా కార్యక్రమం ద్వారా సంపాదించిన మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థలకు ఇస్తారు.
Advertisements
Advertisements
ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ బాతుల రేస్ కాంపిటీషన్లు జరుగుతాయి. జనాలు వీటిలో ఉత్సాహంగా పాల్గొంటారు. అంతేకాదు.. ఈ పోటీలు చాలా ఆసక్తికరంగా సాగుతాయి. కాబట్టే చాలా మంది వీటిల్లో పాల్గొనేందుకు ఆసక్తిని చూపిస్తారు. దీని వల్ల విరాళాలు కూడా ఎక్కువగా పోగవుతాయి. వాటిని స్వచ్ఛంద సేవా సంస్థలకు తరువాత అందజేస్తారు. ఇక నదిలో ఉండే ఆ బాతుబొమ్మలను తీసి క్లీన్ చేస్తారు. ఇలా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు. పేదలు, అనాథలకు చేయూతనందించేందుకు నిజంగా ఈ తరహా కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.