Advertisement
సినిమాల్లో హీరోగా ఒక్క రోల్ చేసి మెప్పించడమే కష్టం అలాంటిది డ్యూయల్ రోల్ అంటే అది కొంత రిస్క్ అనే చెప్పాలి . మరి త్రిబుల్ రోల్ చేస్తే సాహసమే.! ఒకే హీరో మూడు పాత్రల్లో నటించాలి అంటే ఒక్కో పాత్రకి ఒక్కో బాడీ లాంగ్వేజ్ , ఒక్కో మ్యానరిజం మెయింటేన్ చేయాలి. అది చాలా కష్టమైన పని. అలా ఇప్పటివరకు 6 గురు మాత్రమే తెలుగు సినిమాల్లో త్రిబుల్ రోల్స్ చేశారు . ఆ స్టార్స్ ఎవరు ? ఆ సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం
1. NTR:
తెలుగు సినిమా చరిత్రలో ఫస్ట్ టైమ్ త్రిబుల్ రోల్ చేసిన హీరో NTR. 1975 లో రిలీజైన దాన వీర సూర కర్ణ సినిమాలో కృష్ణుడు , కర్ణుడు , దుర్యోధనుడు పాత్రలు చేశారు. అప్పట్లో పెను సంచలనం సృష్టించింది . ఎన్టీఆర్ నట విశ్వరూపంతో ఈ సినిమా సూపర్ హిట్టయింద .
2. కృష్ణ:
Advertisements
టాలీవుడ్ హిస్టరీ లోనే ఎక్కువ సార్లు త్రిబుల్ రోల్ చేసి ఆన్ బీటబుల్ రికార్డ్ క్రియేట్ చేశారు కృష్ణ . ఒక్క సినిమానే కష్టం అనుకుంటే ఏకంగా 7 సార్లు ఈ ఫీట్ సాధించాడు కృష్ణ. ఫస్ట్ టైమ్ 1978 లో కృష్ణ మూడు పాత్రల్లో నటించిన కుమార్ రాజా రిలీజై సూపర్ హిట్టయింది. తర్వాత 1982 లో రెండు సినిమాల్లో త్రిబుల్ రోల్ చేసాడు . వాటిల్లో పగబట్టిన సింహం హిట్ అవ్వగా , డాక్టర్ సినీ యాక్టర్ యావరేజ్ గా ఆడింది . 1983 లో సిరిపురం మొనగాడు సినిమాలో నాలుగోసారి త్రిబుల్ రోల్ చేశాడు అదికూడా యావరేజ్ గా ఆడింది . మళ్ళీ 1984 లో రెండు సినిమాల్లో త్రిబుల్ రోల్స్ చేయగా వాటిల్లో రక్తసంబంధం ప్లాప్ అవ్వగా ,బంగారు కాపురం యావరేజ్ అనిపించుకుంది. ఇక 1997 లో 7 వ సారి బొబ్బిలి దొర సినిమాలో త్రిబుల్ రోల్ చేయగా అదికూడా ప్లాప్ అయింది.
Advertisement
3. శోభన్ బాబు:
1983 లో శోభన్ బాబు ముగ్గురు మొనగాళ్ళు అనే సినిమాలో మొట్టమొదటి సారిగా త్రిబుల్ రోల్ లో యాక్ట్ చేశారు . కానీ అది ప్లాప్ అయ్యింది.
4. చిరంజీవి:
1994 లో మెగాస్టార్ మూడు పాత్రల్లో నటించిన చిత్రం ముగ్గురు మొనగాళ్ళు… అప్పట్లో ఈ సినిమా గురించి అంతా విశేషంగా చెప్పుకున్నారు .
5. బాలకృష్ణ:
2012 లో బాలకృష్ణ అధినాయకుడు అనే సినిమాలో త్రిబుల్ రోల్ చేయగా ఆ సినిమా యావరేజ్ గా నిలిచింది.
6. జూనియర్ NTR:
2017 లో జై లవకుశ సినిమాలో మూడు పాత్రల్లో నటించి మెప్పించాడు యంగ్ టైగర్ . ఎన్టీఆర్ నటనతో బాక్స్ ఆఫీసు వద్ద ఈ సినిమా ఘన విజయం సాధించింది .
Advertisements
మన టాలీవుడ్ లో త్రిబుల్ రోల్ చేసిన చాలా సినిమాలు ఎక్కువ శాతం పరాజయం పాలయ్యాయి . దాన వీర శుర కర్ణ , కుమార్ రాజా , జై లవ కుశ , ఈ మూడు సినిమాలే ఆ క్యాటగిరి లో టాప్ 3 సినిమాలుగా చెప్పుకోవచ్చు . ఇక కమల్ హాసన్ దశావతారం గురించి చెప్పాల్సిన పనిలేదు ….ప్రతి క్యారెక్టర్ లో వేరియేషన్స్ ఆ నటన వేరే లెవల్.!