Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

11 సినిమాలు చేస్తే అందులో 7 బ్లాక్ బ‌స్ట‌ర్లు! మాట‌ల మాంత్రికుడి మ్యాజిక్! ఆ సినిమాలు వాటి విశేషాలు.

Advertisement

మాట‌ల ర‌చ‌యిత‌గా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ త‌ర్వాత మెగాఫోన్ ప‌ట్టి డైరెక్ట్ అవ‌తార‌మెత్తాడు. మొద‌టి సినిమాతోనే సూప‌ర్ హిట్ కొట్టిన త్రివిక్ర‌మ్ త‌ర్వాతి రెండు సినిమాల‌ను కూడా హిట్ చేయించి హ్యాట్రిక్ కొట్టాడు. మామూలు క‌థ‌ల‌నే డిఫ‌రెంట్ స్క్రీన్ ప్లేతో ప్ర‌జెంట్ చేయ‌డం త్రివిక్ర‌మ్ స్టైల్…అందుకే ఆయ‌న తీసిన 11 సినిమాల్లో 7 బ్లాక్ బ‌స్ట‌ర్లుగా నిలిచాయి.

1. నువ్వే నువ్వే:

తరుణ్ , శ్రేయ లు హీరో హీరోయిన్స్ గా  నటించిన “నువ్వే నువ్వే ” సినిమా  త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వచ్చిన మొట్టమొదటి సినిమా. ఈ సినిమా అక్టోబర్ 10 ,2002  న  రిలీజైంది. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద సూపర్ హిట్ గా నిలిచింది .

2. అతడు:

Advertisements

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన రెండవ సినిమా అతడు . ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ హైలెట్.! 10 ఆగస్ట్ 2005 లో రిలీజైన ఈ సినిమా మహేష్ బాబు కెరీయర్లోనే దిబెస్ట్ మూవీగా నిలిచి బాక్స్ ఆఫీసు వద్ద బ్లాక్ బస్టర్  అయింది .

 

3. జల్సా:

త్రివిక్రమ్ మరియు పవన్ కళ్యాణ్ కాంబోలో వ‌చ్చిన సినిమా జల్సా . ఈ సినిమా అప్పటి యూత్ లో ఒక సెన్సేషినల్  క్రేజ్ ను క్రియేట్ చేసింది . ఈ సినిమాలో దేవిశ్రీ సాంగ్స్ సూపర్ హిట్ గా నిలిచాయి. ఏప్రిల్ 02 , 2008 లో ఈ సినిమా రిలీజైన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

4.ఖలేజా:

అత‌డు స్పూర్తితో మరోమారు జ‌త‌క‌ట్టిన మ‌హేష్ , త్రివిక్ర‌మ్ లు ఈ సినిమాతో ఫెయిల్ అయ్యారు. అక్టోబర్ 07, 2010 లో విడుద‌లైన ఈ సినిమా ప్లాప్ గా నిలిచింది. కానీ క‌థ విభిన్నంగా ఉంటుంది. ఇప్ప‌టికీ చాలా మంది ఈ సినిమా విప‌రీతంగా ఇష్ట‌ప‌డ‌తారు.

5. జులాయి:

అల్లు అర్జున్ సూప‌ర్ స్టార్ గా నిలబెట్టిన చిత్రమిది! త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన మాస్ అండ్ యాక్షన్  సినిమా జులాయి . ఈ సినిమా ఆగస్టు 09 , 2012 లో రిలీజై  బాక్స్ ఆఫీసు వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

6. అత్తారింటికి దారేది:

Advertisement

జ‌ల్సా త‌ర్వాత జ‌త క‌ట్టిన త్రివిక్ర‌మ్ + ప‌వ‌న్ లు …ఈ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టారు.
ఈ సినిమా సెప్టెంబర్ 27 2013 లో విడుదలైన ఈ సినిమా 184 కోట్లు వసూల్ చేసి ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొట్టింది.

7. S/o సత్యమూర్తి:

జులాయి త‌ర్వాత బ‌న్నీ+ త్రివిక్ర‌మ్ కాంబోలో వ‌చ్చిన ఈ చిత్రం యావ‌రేజ్ గా ఆడింది. క‌థ బాగున్న‌ప్ప‌టికీ వీరి జంట మీద పెట్టుకున్న విప‌రీత‌మైన ఎక్స్ పెక్టేష‌న్స్ వ‌ల్ల సినిమా యావ‌రేజ్ గా ఆడింది.

8. అ ఆ:

నితిన్ , సమంత హీరో హీరోయిన్స్ గా  త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన  సినిమా  అ ఆ .. ఈ సినిమా జూన్ 2 , 2016 లో రిలీజయింది . 35 కోట్లతో చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద 74 కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది .

9. అజ్ఞాత వాసి:

జ‌ల్సా, అత్తారింటికి దారేదీ సినిమాలు ఇచ్చిన స‌క్సెస్ తో మరోమారు జ‌త‌క‌ట్టిన తివిక్ర‌మ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు ….ఈ సినిమాతో ప్లాప్ ను ఇచ్చారు. మొద‌టి వారం కలెక్ష‌న్ల క‌న‌క‌వ‌ర్షం కురిసిన‌ప్ప‌టికీ త‌ర్వాత నెగెటివ్ టాక్ తో న‌ష్టాల‌ను తీసుకొచ్చింది.

10.అరవింద సమేత:

త్రివిక్రమ్ డైరెక్షన్లో  ఎన్టీఆర్ హీరోగా  రాయలసీమ బ్యాక్డ్రాప్ లో వచ్చిన సినిమా అరవింద సమేత వీర రాఘవ . ఈ సినిమా అక్టోబర్ 11, 2018 లో రిలీజైన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో త్రివిక్ర‌మ్ కాస్త త‌న జాన‌ర్ ను దాటి చేసిన‌ట్టు అనిపించింది.

11. అలా వైకుంఠపురంలో:

జులాయి, S/o సత్యమూర్తి త‌ర్వాత బ‌న్నీతో మూడోసారి జ‌త‌క‌ట్టిన త్రివిక్ర‌మ్ ఈసారి అలా వైకుంఠపురంలో…పేరుతో బ్లాక్ బ‌స్ట‌ర్ ను ఇచ్చారు. 100 కోట్ల బ‌డ్జెట్ తో జనవరి 12 , 2020 లో రిలీజైన ఈ సినిమా 200 కోట్లు వసూలు చేసింది.

Advertisements