Advertisement
ఉప్పల్ లో జరగబోయే ఐపిఎల్ టి ట్వంటీ 2021 క్రికెట్ అడ్డుకుంటాం అంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో హైదరాబాదీయులను కొనుగోలు చేయకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేసారు. జూబ్లీహిల్స్ ఫిలింనగర్ లో టిఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో పాల్గొన్న ఆయన హైదరాబాద్ జట్టు యాజమాన్య తీరుని తప్పుబట్టారు.
ఐపిఎల్ వేలం లో హైదరాబాద్ క్రికెట్ క్రీడాకారులకు అన్యాయం జరిగిందంటూ మండిపడ్డారు. హైదరాబాద్ లో జరిగే టీ 20 మ్యాచ్ లను అడ్డుకుంటామని ఈ సందర్భంగా వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ క్రికెటర్లకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసారు. ఐపీఎల్ లో సత్తా చాటే క్రికెటర్లు హైదరాబాద్ లో చాలా మంది ఉన్నారరన్న ఆయన… హైదరాబాద్ క్రీడాకారుడు లేకుండా ఈ సీజన్ నిర్వహిస్తే కచ్చితంగా అడ్డుకుంటామని స్పష్టం చేసారు.
Advertisement
ఈ విషయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ స్పందించాలని అని కోరారు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం హైదరాబాద్ ప్లేయర్ ని తీసుకోకపోవడం సరైంది కాదు అని, ప్రతిభావంతులైన ప్లేయర్స్ హైదరాబాద్ లో ఉన్నారన్నారు. ఇప్పటికైనా సన్ రై్జర్స్ హైదరాబాద్ స్పందించి… హైదరాబాద్ ప్లేయర్ ని తీసుకోవాలి అని డిమాండ్ చేసారు. మ్యాచ్ ఫిక్సింగ్ లో దొరికిన డేవిడ్ వార్నర్ సన్ రైజర్స్ టీమ్ కి కెప్టెన్ గా ఉన్నాడు అంటూ ఆరోపణలు చేసారు.
Advertisements
లేదా సన్ రైజర్స్ హైదరాబాద్ టీం పేరును మార్చుకోవాలి అని డిమాండ్ చేసారు. కాగా నిన్న జరిగిన ఐపిఎల్ వేలం పాటలో హైదరాబాద్ నుంచి ఒక్క ఆటగాడు లేకుండానే హైదరాబాద్ జట్టు వేలంను ముగించింది. ఇతర రాష్ట్రాల జట్లు మన ఆటగాళ్ళ మీద కాస్తో కూస్తో శ్రద్ధ చూపిస్తే హైదరాబాద్ ఏ మాత్రం కూడా ఆసక్తి చూపించలేదు. జట్టు పేరు మాత్రమే హైదరాబాద్ కాగా జట్టులో ఒక్క ఆటగాడు కూడా లేకపోవడం విస్మయానికి గురి చేసింది.
Advertisements