Advertisement
అది 2010 సంవత్సరం…..ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఓ జంట….రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.! ఇంజనీరింగ్ కంప్లీట్ అవ్వగానే మంచి కంపెనీలో జాబ్ సాధించి….ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవాలనేది వారి లక్ష్యం.! అనుకున్నట్టుగానే ఇంజనీరింగ్ అవ్వగానే అమ్మాయి…ఓ మంచి ఇంజనీరింగ్ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాయిన్ అయ్యింది!
కానీ అబ్బాయి మాత్రం ఇచ్చిన ఇంటర్వ్యూలన్నీ రిజెక్ట్ అవుతున్నాడు.! ఎక్కడ తను దూరమౌతుందోననే టెన్షన్ ఒకవైపు, తన ఫ్రెండ్స్ అందరూ ఇంటర్వ్యూలలో సెలెక్ట్ అవుతున్నారు…తను మాత్రం ఎందుకు రిజెక్ట్ అవుతున్నాడో అర్థంకాని పరిస్థితి మరోవైపు… అయినా తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నాడు.!
Advertisement
ఇక్కడే అసలైన ప్రేమ…..తన తత్వాన్ని బటయపెట్టింది.! నిరాశలో కూరుకుపోతున్న అబ్బాయిలో నూతనోత్తేజాన్ని నింపింది ఆ అమ్మాయి.! సహనాన్ని కోల్పోవొద్దని కొంత పంథాలో ప్రయత్నాలు సాగించమని హితబోధ చేసింది…ఎప్పటికప్పుడు అతడిలో ధైర్యాన్ని నింపేది…. అవసరమైనప్పుడు అడగకుండానే ఆర్థికంగా అతన్ని ఆదుకునేది….అతడి ప్రతి ఇంటర్వ్యూ కు కొత్త షర్ట్ ను ఇప్పించి…. ఆల్ ది బెస్ట్ చెప్పి మరీ పంపించేది!
Advertisements
9 నెలల తర్వాత…. ఓ పెద్ద కంపెనీ నిర్వహించిన ఇంటర్వ్యూలో మనోడు సెలెక్ట్ అయ్యాడు..అది కూడా గతంలో అతడిని రిజెక్ట్ చేసిన కంపెనీలు ఇచ్చే ప్యాకేజ్ కంటే ఎక్కవ ప్యాకేజీతో….! 2014 లో ఆ అమ్మాయినే ఇల్లాలిగా చేసుకున్నాడు.! నిజమైన ప్రేమ తమ సహచరులను ప్రోత్సాహిస్తుంది., అండగా నిలుస్తుంది! తన విజయాన్ని కాంక్షిస్తుంది..అనడానికి ఈ దంపతుల రియల్ స్టోరియే నిదర్శనం….ఆల్ ది బెస్ట్!
Advertisements