Advertisement
చైనా ఆర్మీతో జరిగిన ఘర్షణలో అమరడైన సంతోష్ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పిన CM KCR ….అన్నమాట ప్రకారం నిన్న ( సోమవారం జూన్22 న) సూర్యాపేటలోని వారి స్వస్థలానికి వెళ్లి…ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా…సంతోష్ బాబు భార్య సంతోషికి గ్రూప్-1 నియామక పత్రాన్ని…4 కోట్ల చెక్ ను అందించారు. సంతోష్ బాబు తల్లిదండ్రులకు 1 కోటి రూపాయల చెక్ ను అందించారు. దీనితో పాటు హైద్రాబాదలో 711 గజాల ఇంటిస్థలాన్ని ఇచ్చారు.
ఇంటిస్థలం ఎక్కడ?
సంతోష్ బాబు కుటుంబానికి ఇవ్వడం కోసం…మొదటగా హైద్రాబాద్ లోని 5 ప్రభుత్వ స్థలాలను ఎంపిక చేశారు. అందులో ఒకటి ఫైనల్ చేశారు. ఎంపిక చేసిన అయిదింటిలో…ఈ స్థలమే విలువైనది. బంజారాహిల్స్ రోడ్ నెం-14., తెలంగాణ స్టడీ సర్కిల్ సమీపంలో మెయిన్ రోడ్ మార్గంలో..సర్వే నెంబర్ 6/1 లో 711 గజాల స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్థలం వాల్యూ మార్కెట్ రేట్ ప్రకారం 6 కోట్లకు పైగానే ఉంటుందట.!
Advertisement
CTO గా సంతోషి.
సంతోష్ భార్యకు గ్రూప్ 1 లో CTO ( వాణిజ్య పన్నుల అధికారి) పోస్ట్ కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా…. సంతోషికి CM నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు.. పోలీస్ , రెవెన్యూ, ఎక్సైజ్, కమర్షియల్ …ఈ నాలుగు డిపార్ట్మెంట్స్ లో దేనిలో ఉద్యోగం కావాలో 4 రోజుల్లో నిర్ణయం తెలుపమన్నారు.!
Advertisements
Advertisements
- కుటుంబ పరిస్థితులు కాస్త సర్దుకున్నాక…. ప్రగతి భవన్ కు రావాలని..కలిసి భోజనం చేద్దామని సంతోష్ కుటుంబ సభ్యులకు తెలిపారు CM .
- సూర్యాపేటలో సంతోష్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు – కోర్ట్ సర్కిల్ కు సంతోష్ బాబు సర్కిల్ గా నామకరణం చేస్తామని తెలిపారు మంత్రి జగదీశ్ రెడ్డి.!