Advertisement
ఈ విషయం చెప్తే మీకు నవ్వొస్తుంది కానీ… ఆ క్షణం తల ఎక్క డ పెట్టుకోవాలో అర్దం కాక కొద్దిసేపు కోమాలోకి పోయినంత పనైంది..అఫ్కోర్స్ ఇప్పుడు తలచుకుంటే నాక్కూడా నవ్వొస్తుంది.. ఒకరోజు ఇంట్లో ఫ్యామిలి అందరం కూర్చుని టివి చూస్తున్నాం..నా లక్ ఏంటంటే మా నాన్న ఉండుంటేనా ఇక జన్మలో టివి చూసేదాన్ని కాదేమో..
ఆ ఏముంది..ఫ్యామిలి అందరూ టివి చూస్తుంటే ఏదో రొమాంటిక్ సీన్ వచ్చుంటుంది.. దానికే అంత కంగారా?? అనుకుంటున్నారా.. రొమాంటిక్ సీన్ అయితే నేను ఎంజాయ్ చేసేదాన్నేమో..కానీ జరిగింది వేరే…
ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చూస్తుంటే , V6 లైవ్ పెట్టు అంది మా అమ్మ…..మా టివి రిమోట్ కంట్రోల్ కి వాయిస్ కంట్రోల్ ఆఫ్షన్ ఉంది. Alexa V6 లైవ్ అని అన్నాను.. నా కర్మ కాలి అది S*x live అని ఆఫ్షన్ ఓపెన్ అయింది..
Advertisement
ఇహ చూస్కోండి..టివి స్క్రీన్ పై వచ్చిన విజువల్ కి నా కళ్లు తిరిగినంత పనైంది..ఏం జరుగుతుందో అర్దం కాలేదు..Alexa V6 live అని గట్టిగా అరిచాను..లోడ్ అవ్వడానికే టైం పట్టింది.. వెంటనే బ్యాక్ బటన్ నొక్కా.. నా బ్యాడ్ టైం స్టార్టయింది అని అర్దం అయింది.. అప్పటివరకు పనిచేసిన రిమోట్ అప్పుడే పనిచేయలేదు.. ప్చ్..సెకన్లు యుగాళ్లా గడుస్తున్నాయి.. నా చిన్నమెదడు పనిచేయడం మానేసి కోమాలోకి పోయినట్టుగా అనిపిస్తుంది..
Advertisements
స్క్రీన్ పై విజువల్ రన్ అవుతూనే ఉంది..మా అక్క ముసిముసిగా నవ్వుకుంటుంది.. మా అమ్మ అసలు ఏం జరిగిందో, ఏం జరుగుతుందో తను నోటిస్ చేయనట్టుగా ప్రవర్తిస్తుంది.. ఛానల్ మారింది..నాకు ఊపిరి లేచొచ్చింది.. మాతో మా నాన్న ఉండుంటే నా పరిస్థితి ఏంటి.. ఛీ.. జన్మలో మళ్లీ రిమోట్ ముట్టుకోకూడదని..ముట్టుకున్నా వాయిస్ కంట్రోల్ ఆఫ్షన్ వాడకూడదని డిసైడ్ అయ్యా..!
Advertisements