Advertisement
కవలలు ఎలా పుడతారనే విషయం తెలుసుకునే ముందు అసలు పిల్లలు ఎలా పుడతారో తెల్సుకుంటే కాన్సెప్ట్ క్లియర్ గా అర్థమౌతుంది. ఆడవారిలోని అండం, మగవారిలోని శుక్రకణం కలిసి ఫలదీకరణం చెంది పిండం ఏర్పడి…..తల్లి కడుపులో శిశువుగా రూపాంతరం చెందుకుంటూ 9 నెలల తర్వాత డెలివరీ అవుతుంది.
రజస్వల( పెద్దమనిషి) అయినప్పటి నుండి ప్రతినెలా ఆడవారిలో అండం విడుదలవుతూనే ఉంటుంది. అలా విడుదలైన అండం మగవారి వీర్యంలో ఉండే శుక్రకణంతో జతైతే గర్భం వస్తుంది..లేకపోతే అండం చనిపోయి…. బహిస్ట్ సమయంలో రక్తంగా బయటకు వచ్చేస్తుంది!
కవలలు ఎలా పుడతారు?
సాధారణంగా మహిళల్లో అండం…. ఒక నెల ఎడమ అండాశయం నుంచి మరో నెల కుడివైపు అండాశయం నుంచి విడుదలవుతుంది. ఒక్కోసారి రెండు అండాశయాల నుంచి అండాలు విడుదల అవుతాయి. అలా విడుదలైన అండాలను రెండు వీర్యకణాలు వేర్వేరుగా కలిస్తే రెండు ఫలదీకరణాలు జరుగుతాయి. ఫలితంగా కవలలు జన్మిస్తారు.
Advertisement
కవలలు ఒకేలాగే ఉంటారా?
పైన చెప్పినట్టు జరిగితే….కవలలు కూడా వేరువేరుగా ఉంటారు. కానీ ఫలధీకరణం చెందిన అండం రెండు భాగాలుగా విడిపోతే…..అప్పుడు పుట్టే పిల్లలు సేమ్ టు సేమ్ ఉంటారు…మ్యాగ్జిమమ్ వీళ్లు ఉంటే ఇద్దరు అమ్మాయిలు, లేకపోతే ఇద్దరబ్బాయిలుగా ఉంటారు.! పై సందర్భంలో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, లేదా ఇద్దరు అమ్మాయిలు ,ఇద్దరబ్బాయిలు కలగవచ్చు!
Advertisements
పుట్టేది అమ్మాయా? అబ్బాయా? ఎలా డిసైడ్ అవుతుంది!
పురుషుల్లో XY అనే క్రోమోజోమ్స్ ఉంటాయి. స్త్రీలలో XX అనే క్రోమోజోమ్స్ ఉంటాయి. ఫలదీకరణం సందర్భంలో….పురుషుల నుండి ఒక క్రోమోజోమ్, స్త్రీల నుండి ఒక క్రోమోజోమ్ వచ్చి ఫలదీకరణం చెందుతాయి… స్త్రీల నుండి కేవలం X మాత్రమే వస్తుంది…పురుషల నుండి X, Y లలో ఏదో ఒకటి వస్తుంది….ఒకవేళ పురుషుని నుండి X వస్తే…అంతకు ముందే స్త్రీ నుండి వచ్చిన X తో కలిసి…. XX అయ్యి అమ్మాయి పుడుతుంది. పురుషుని నుండి Y వస్తే…స్త్రీ నుండి వచ్చిన X తో కలిసి XY అయ్యి అబ్బాయి పుడతాడు.!
Advertisements