Advertisement
రెండు తలల పాము ఓ విషరహిత సర్పం. ఇది ప్రధానంగా ఇరాన్, పాకిస్తాన్, భారత దేశాల్లో ఎక్కువగాకనిపిస్తుంటాయి. నిజానికి ఈ పాములకు రెండు తలలు ఉండవు…. తోక చివరి భాగం గుండ్రంగా ఉండి, తలను పోలి ఉండడం వలన దీనికి రెండు తలల పాము అనే పేరు స్థిరపడింది! పాములను ఆడించే వాళ్లు…. వీటి తోకపై తల రూపం వచ్చేటట్లు నలుపు రంగువేసి…..దీని వల్ల సిరి సంపదలు కలుగుతాయని నమ్మబలుకుతారు.
Advertisement
#రెండు తలల పాము ఎయిడ్స్ ను నయం చేయగలదా?
ఇది 100 శాతం అపోహ మాత్రమే…రెండు తలల పాము లో ఎయిడ్స్ ను నయం చేసే గుణాలు కానీ లైంగిక సామర్థ్యం పెంచే గుణాలు కానీ లేవు! కానీ కొన్ని ఔషదాల్లో దీన్ని వినియోగిస్తారని చెప్పి బ్లాక్ మార్కెట్ లో 3 నుండి 10 లక్షల రూపాయల వరకు ధర పలుకుతోంది. అయితే ఈ పాములను పట్టుకోవడం చట్టరీత్యా నేరం!
Advertisements