Advertisement
ఇది నిన్నా మొన్నటి విషయం కాదు కాని…చానాళ్ల క్రితం ఒక పెళ్లి ఉందని అమ్మ నన్ను కూడా రమ్మంది..దూరం చుట్టాలంటే మరీ దూరం కాదు.. అంతమాత్రానా దగ్గరి బంధుత్వం కాదు.. సరే వెళ్దాం మనకు టైం పాస్ అని అమ్మతో పాటు వెళ్లా.. ఇద్దరు అక్కాచెల్లెల్ల పెళ్లిల్లు ఒకే రోజు చేస్తున్నారు.. పెళ్లి ఇల్లు ఫుల్లు బిజిబిజిగా ఉంది..తెల్లారితే పెళ్లి.. ఆచారాల ప్రకారం ముందు రోజు జరగాల్సిన పనులు చూస్తున్నారు.
నేను రెడీ అయి నిల్చున్నాను…నా పక్కన ఇద్దరు అందమైన పెళ్లికూతుర్లున్నారు.. చూడగానే ఏ అబ్బాయైనా ఇష్టపడేంత అందంగా ఉన్నారు..అందంతో పాటు వారిద్దరికి తెలివి కూడా ఉంది బాగా చదువుకున్నారు..నాకు పెళ్లితంతు అంతా చూడముచ్చటగా అనిపించింది..అసలు కథ అప్పుడే మొదలైంది..
Advertisement
పెళ్లికొడుకు(బావ) చెప్పులు దాచిపెట్టి డబ్బులు డిమాండ్ చేయాలి..నేను ఆ ఇంటికి కొత్త కావడంతో సరదాగా ఉంటుంది అని నన్ను కూడా ఇన్వాల్వ్ అవమన్నారు..అతికష్టంమీద చెప్పులు దాచిపెట్టాము.. అబ్బాయిని పదివేలు డిమాండ్ చేసారు పెళ్లికూతురి చెల్లెల్లు,తమ్ముళ్లు.. రెండు వేలిస్తామన్నారు..లేదు 5వేలైనా ఇవ్వాల్సిందే అని వీళ్లు పట్టుబట్టారు.. దెబ్బకి అవతలి నుండి వచ్చిన సమాధానానికి నాకు తల తిరిగింది.ఇస్తే ఇవ్వండి లేకపోతే మీ పిల్లను కూడా ఉంచుకోండి..నేనిప్పుడే వెళ్లిపోతాను అన్నాడు..
నేను ఒకసారి అమ్మాయిల వైపు చూసాను..రాకుమార్తెల్లా ఉన్నారు.. 15లక్షల కట్నం తీసుకున్నాడు అబ్బాయి..5వేల కోసం అంతపెద్ద నిర్ణయం తీసుకున్నాడు.. నాకైతే కాసేపు ఆ అమ్మాయిలు అంగట్లో బొమ్మల్లా అనిపించారు..వాతావరణం వేడెక్కుతుంది.. సరదాగా ముగియాల్సిన కార్యక్రమం గొడవకు దారితీసింది..ఆడపిల్ల తరపువారు కూడా ఈ పిల్లల్నే తిట్టారు..పెళ్లి జరగాలా వద్దా అని చెప్పి,రెండు వేలు కూడా వద్దని అబ్బాయికి ఇచ్చేసి,అబ్బాయిని క్షమించమని వేడుకుంటున్నారు..
Advertisements
నాకంతా వింతగా ఉంది…కట్నం ఇచ్చి,పెద్దరికం కట్టబెట్టి ఇంత దిగజారి బతకాలా అనిపించింది.. నా మనసుకి నచ్చినవాడు మాత్రమే కాదు, నన్ను గౌరవించేవాడినే పెళ్లి చేసుకోవాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నాను.!
Advertisements