Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

పావురం కోసం ప్రాణాలిచ్చిన శిబి చ‌క్ర‌వ‌ర్తి క‌థ గురించి మీకు తెలుసా?

Advertisement

శిబి చ‌క్ర‌వ‌ర్తి గొప్ప దాన‌గుణం క‌ల‌వాడు…అనే వార్త ఇంద్రుడి వ‌ర‌కు వెళ్లింది.! స్వ‌యంగా అత‌ని గుణాన్ని ప‌రీక్షించ‌ద‌లిచి ఇంద్రుడు డేగ రూపంలో, అగ్నిదేవుడు పావురం రూపంలోకి మారుతారు! డేగ ( ఇంద్రుడు) పావురాన్ని(అగ్నిదేవుడు) త‌రుముతుండ‌గా ….భృగుతుంగ ప‌ర్వతం మీద యజ్ఞం చేస్తున్న‌ శిబి చ‌క్ర‌వ‌ర్తి భుజంపై వాలిన పావురం…. త‌న‌ను ర‌క్షించ‌మ‌ని శిబిని వేడుకుంటుంది. అందుకు శిబి నిన్ను ర‌క్షిస్తాను అనే హామీని పావురానికి ఇస్తాడు.!

అంతలో అక్కడికి చేరుకున్న డేగ…. మ‌హారాజా ఈ పావురం నా ఆహారం ..దీన్ని విడిచిపెట్టండి నేను ఆక‌లితో ఉన్నాన‌ని అంటుంది, దానికి శిబి ఈ పావురానికి ర‌క్షిస్తాన‌ని మాటిచ్చాను…ఎట్టి ప‌రిస్థితుల్లో దీన్ని విడిచిపెట్ట‌ను…దీని బ‌దులుగా నీకు ఎలాంటి ఆహారం కావాలో కోరుకో ….దాన్ని తెచ్చి పెడ‌తాను అని అంటాడు. దానికి డేగ ఈ పావురానికి స‌రితూగే నీ మాంసాన్ని ఇవ్వ‌మ‌ని అడుగుతుంది!

Advertisement

డేగ కోరిక‌కు సంతోషించిన శిబి త్రాసును తెప్పించి….పావురాన్ని ఒక వైపు ఉంచి త‌న శ‌రీరంనుండి మాంసాన్ని కోస్తూ మ‌రోవైపు వేస్తుంటాడు….ఎంత మాంసం వేసిన‌ప్ప‌టికీ పావురం ఉన్న భాగం వైపే త్రాసు మొగ్గుతూ ఉంటుంది. చివ‌ర‌కు త‌నే త్రాసులో కూర్చుంటాడు.! ఇచ్చిన మాట కోసం…ఆత్మార్ప‌ణ చేసుకోడానికి కూడా వెనుకాడ‌ని అత‌ని త్యాగ‌నిర‌తిని చూసి…..డేగ‌, పావురం రూపంలో ఉన్న ఇంద్ర‌, అగ్రి దేవుళ్లు ప్ర‌త్య‌క్షం అత‌ని
దాన గుణాన్ని కీర్తిస్తారు!

క‌పోతేశ్వ‌ర ఆల‌యం:

Advertisements

ఇదే క‌థ‌కు కొద్ది మార్పుతో….. గుంటూరు జిల్లాలోని చేజ‌ర్ల వ‌ద్ద క‌పోతేశ్వ‌ర ఆల‌యం ఉంది! స్వ‌యంగా శిబి ఇక్క‌డ పావురాన్ని( విష్ణువు) బోయ‌వాడి ( శివుడు) నుండి ర‌క్షించి…. శివైక్యం అయ్యాడ‌ని ప్ర‌తీతి!

Advertisements