Advertisement
2001 లో …. 15 కోట్ల భారీ బడ్జెట్ తో తీసిన దేవి పుత్రుడు సినిమా ప్లాప్ తర్వాత ప్రొడ్యూసర్ MS రాజు ఆర్థికంగా బాగా లాస్ అయ్యారు. ఆ సినిమా ఎందుకు ప్లాఫ్ అయిందో ఆయనకు అర్ధంకావడంలేదు. ఏదో ఓ సినిమా తీసి మళ్లీ లైన్ లో పడాలనే ప్రయత్నంలో తన ఆప్తుడు గోపాల్ రెడ్డికి చెప్పాడు…. అప్పుడు గోపాల్ రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న VN ఆదిత్య దగ్గర చాలా టాలెంట్ ఉంది…. ఓ సారి ట్రై చెయ్ అని ఆదిత్య ఫోన్ నెంబర్ ఇచ్చాడు .
MS రాజు , ఆదిత్య కి నాలుగైదు సార్లు ఫోన్ చేయడం , ఆదిత్య దానిని లైట్ తీసుకోవడం జరిగింది .అంత పెద్ద ప్రొడ్యూసర్ తనతో సినిమా ఎందుకు చేస్తాడులే అనుకున్నాడు ఆదిత్య. మొత్తానికి ఒకరోజు రాజు ఆఫీస్ కి వెళ్లి కలిశాడు. ఒక చిన్న సినిమా చేద్దాం , నేను రెండు లైన్లు చెప్తా ఏది నచ్చితే ఆ కథ రెడీ చెయ్ అని రెండు లైన్లు చెప్పాడు MS రాజు. వాటిల్లో రెండో ఐడియా నచ్చింది ఆదిత్య కు.!
కథ మూలం :
ఎప్పుడో 1946 లో రిలీజ్ అయిన ఆన్ మోల్గడి అనే సినిమా ఇన్స్పిరేషన్ తో రాసుకున్న లైన్ అది . బాగ్యా రాజా తీసిన డొలింగ్ డొలింగ్ షేడ్స్ కూడా దాంట్లో ఉంటాయి . అలా MSరాజు, ఆదిత్య స్క్రిప్ట్ పూర్తిచేశారు . హీరో వర్షంలో ఏడుస్తుంటే హీరో ఫ్రెండ్ ఒక డైలాగ్ చెప్తాడు…. ఒరేయ్ వర్షం కూడా అప్పుడప్పుడు మనకి మేలు చేస్తుంది రా , మన కన్నీళ్లు కూడా ఎదుటివారికి కనిపించకుండా దాచేస్తుంది ! ఈ డైలాగ్ కు MS రాజు మనసు హత్తుకుంది . వెంటనే 25 వేల రూపాయల చెక్ రాసి అడ్వాన్స్ గా ఇచ్చి మూవీ కన్ఫర్మ్ చేసాడు . పరుచూరి బ్రదర్స్ స్క్రీన్ ప్లే అందించారు . తర్వాత రోజే సినిమా అనౌన్స్ చేశారు , టైటిల్ మనసంతా నువ్వే .
Advertisements
నటీ నటులు ఎంపిక :
Advertisement
మొదట హీరోగా మహేష్ బాబుని అప్రోచ్ అయ్యారు , మహేష్ అప్పటికే గుణశేఖర్ డైరెక్షన్లో ఒక మూవీ కమిట్ అయ్యి ఉండడంతో ఈ మూవీని రిజెక్ట్ చేసాడు . కొత్త కుర్రాడు అయితే బాగుంటుందని చెప్పాడు ఆదిత్య . చిత్రం హీరో ఉదయ్ కిరణ్ ను అప్రోచ్ అవుదామనుకున్నారు…. ఆ టైంలో ఉదయ్ నువ్వు నేను షూటింగ్ లో ఉన్నాడు. నువ్వు నేను రష్ ఫీడ్ చూసి ఉదయ్ ను హీరోగా ఫిక్స్ చేశారు.
షూటింగ్:
వెంటనే షూటింగ్ స్టార్ట్ చేసారు. బడ్జెట్ కోటి ముప్పై లక్షలు . అప్పటికి నువ్వు నేను రిలీజ్ కాలేదు కాబట్టి , అంత తక్కువ బడ్జెట్ సాధ్యమైంది . ముందుగా రిలీజ్ అయిన ఆడియో బంపర్ హిట్ అయింది. మలయాళం లో ప్రణయ వర్ధంగళ్ అనే సినిమా కోసం విద్యాసాగర్ చేసిన కన్నాడి కుడూమ్ కుట్టి అనే పాట ట్యూన్ ని యాజిటీజ్ తునిగా , తునిగా సాంగ్ కు వాడేశారు! అలాగే యాంటిక్ వాచ్ సౌండ్ కోసం ఆర్ పి పట్నాయక్ చాలా కష్టపడ్డాడు .
రిలీజ్:
అప్పటికే నువ్వు నేను రిలీజ్ అయ్యి ప్రభంజనం సృష్టించడంతో , ఉదయ్ కిరణ్ కి స్టార్ హోదా వచ్చింది. దాంతో మనసంతా నువ్వే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అక్టోబర్ 19 2001 లో రిలీజైన ఈ సినిమా కల్మషం లేని ప్రేమకథగా ప్రేక్షకుల గుండెల్లో చిరకాలం నిలిచిపోయింది!
బాక్స్ ఆఫీసు
ఈ సినిమా ఉదయ్ కిరణ్ కు వరుసగా మూడో బ్లాక్ బస్టర్ ను ఇచ్చింది. 36 సెంటర్లలో 100 రోజులు ఆడి…. 12 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఈ హిందీ , కన్నడ , తమిళ్ , బంగ్లాదేశి , ఒడియా లోకి రీమేక్ అయింది . సునిల్ స్టార్ కమెడియన్ గా, ఆదిత్యను డైరెక్టర్ గా ,ఉదయ్ కిరణ్ ను యూత్ ఐకాన్ గా నిలబెట్టింది.
Advertisements
దీని తర్వాత ఇలాంటి లవ్ స్టోరీస్ ఎన్ని వచ్చినా మనసంతా నువ్వే మాత్రం హంట్ చేస్తూనే ఉంటుంది . చనిపోయిన ఉదయ్ కిరణ్ ని ఎప్పుడూ బ్రతికిస్తూనే ఉంటుంది .