Advertisement
చరిత్ర గురించి తవ్వేకొద్దీ మనకు ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు బయట పడుతూనే ఉంటాయి. అలాంటి కొన్ని విషయాలు నిజంగా నమ్మలేనివిగా ఉంటాయి. అసలు ఆ సంఘటనలు జరిగాయా ? అని కూడా సందేహం వస్తుంది. అలాంటి కొన్ని నమ్మలేని సంఘటనలు మనలో ఆసక్తిని కూడా ఇంకా పెంచుతుంటాయి. అలాంటి పలు సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. క్రిస్టొఫర్ కొలంబస్ 1490వ సంవత్సరంలో నూతన ప్రాంతాలను కనుగొన్నాడు. అయితే దాని వల్ల మహిళలను బానిసలుగా చేసుకునే సాంప్రదాయం అమలులోకి వచ్చింది. కొలంబస్‌కు కరీబియాలో కొందరు మహిళలు కనిపించారు. వారిని అతనికి అక్కడి వారు బహుమతులుగా అందజేశారు. అయితే ఆ మహిళలు అందుకు వ్యతిరేకంగా పోరాడారు. లైంగిక దాడికి వ్యతిరేకంగా ఉద్యమించారు. అయినప్పటికీ కొలంబస్ తన షిప్పులలో 1000 మందికి పైగా మహిళలను బానిసలుగా చేసుకుని యూరప్‌కు వెళ్లాడు.
Advertisement
2. జాకబ్ వెట్టర్‌లెయింగ్ అనే 11 ఏళ్ల బాలుడు 1989, అక్టోబర్ 22న చనిపోయాడు. అయితే అతను కిడ్నాప్ అయ్యాడు. 27 ఏళ్లపాటు అతని కిడ్నాప్ విషయం మిస్టరీగానే ఉండిపోయింది. ఈ సంఘటన అమెరికా ప్రజల జీవితాలనే మార్చేసింది. అమెరికా చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ కాలం (27 ఏళ్లు) పాటు పరిష్కారం కాబడని కేసుగా మిగిలిపోయింది. కానీ 27 ఏళ్ల తరువాత ఓ వ్యక్తి తాను జాకబ్‌ను కిడ్నాప్ చేసి అతనిపై లైంగిక దాడి చేశానని, అనంతరం అదే రోజు అతన్ని పొదల్లో హత్య చేశానని తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. ఈ క్రమంలో పొదల్లో దొరికిన జాకబ్ అవశేషాలకు డీఎన్ఏ టెస్టులు చేసి అతను చనిపోయాడని పోలీసులు నిర్దారించారు. దీంతో ఎట్టకేలకు ఆ కేసు మిస్టరీ వీడింది. 27 ఏళ్లకు ఆ కేసు పరిష్కారం అయింది. అది కూడా నేరస్థుడు నేరం చేశానని అంగీకరిస్తూ ముందుకు వచ్చాడు కనుక.. కేసు మిస్టరీ వీడింది. కానీ అతను అలా చేయకపోయి ఉంటే ఇప్పటికీ అది పరిష్కారం కాబడని కేసుగానే మిగిలిపోయి ఉండేది.
Advertisements
Advertisements
3. మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యా సైనికులు తీయించుకున్న ఫొటో ఇది. రష్యాకు చెందిన ఇంపీరియల్ ఆర్మీ అప్పట్లో అతి పెద్ద ఆర్మీగా ఉండేది. వారందరూ కలిసి తీయించుకున్న ఫొటో ఇది. సాధారణంగా ఇంత పెద్ద సంఖ్యలో ఇప్పటి వరకు సైనికులు ఫొటో తీసుకోలేదు. ఇక సైనికులు అప్పట్లోనే జంతువులను ఇష్టపడే వారు అని చెప్పేందుకు ఈ ఫొటోయే ఉదాహరణ. అందులో ఒక శునకాన్ని మనం చూడవచ్చు.