Advertisement
క్రికెట్ లో జట్టుని గెలిపించడం అనేది ప్రతీ ఆటగాడి ముందు ఉన్న కర్తవ్యం. ఏ పరిస్థితిలో ఉన్నా సరే జట్టుని సమర్ధవంతంగా ముందుకు నడిపించాలి. సెంచరీ కోసం రికార్డ్ కోసమో చూడటం అనేది కరెక్ట్ కాదు. ఈ విషయం తెలిసిన చాలా మంది ఆటగాళ్ళు… గాయాలైనా సరే జట్టుని ముందుకు నడిపిస్తారు. చెన్నైలో జరిగిన ఒక మ్యాచ్ లో సచిన్ తీవ్ర నొప్పితో బాధపడుతూ కూడా 99 పరుగులు చేసాడు.
అలాంటి ఇన్నింగ్స్ కంటే కూడా మరో గొప్ప ఇన్నింగ్స్ ఉంది. 1984 లో ఇంగ్లాండ్ పర్యటనలో రెండో టెస్ట్… ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 270 పరుగులు చేసింది. అయితే లారి గోమ్స్ వెస్టిండీస్ ని ఆదుకున్నాడు. సెంచరీ చేసి మ్యాచ్ ని కాపాడాడు. సహచరులు అందరూ అవుట్ అవుతున్నా సరే అతను మాత్రం నిలబడ్డాడు. వరుసగా వికెట్ లు కోల్పోతున్నా సరే అతను చివరి వికెట్ సహకారంతో సెంచరీ చేసాడు.
Advertisement
Advertisements
అంతకుముందు ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు బొటనవేలు విరిగింది. ఆ నొప్పిని భరిస్తూ… బ్యాటింగ్ చేసాడు. ఒంటి చేత్తో బ్యాటింగ్ చేసాడు జట్టు కోసం. క్రికెట్‌లో ఇది అత్యంత నిస్వార్థ ఇన్నింగ్స్ అని అభిమానులు చెప్తూ ఉంటారు. అతను బ్యాటింగ్ చేయకపోయినా ఎవరూ అడిగే వాళ్ళు లేరు. కాని అతను జట్టు కోసం ఆడాడు. 2 వ ఇన్నింగ్స్‌లో విరిగిన బొటనవేలుతో బౌలింగ్ చేశాడు. 7/53 బౌలింగ్ గణాంకాలను నమోదు చేసి సంచలనం సృష్టించాడు. క్లైవ్ లాయిడ్ ఈ ఇన్నింగ్స్ పై మాట్లాడుతూ… క్రికెట్ లో చరిత్రలో తాను చూసి అత్యంత సాహసోపేతమైన బ్యాటింగ్ గా చెప్పాడు. ఈ మ్యాచ్ తర్వాత అతనికి స్వదేశంలో ఘన స్వాగతం లభించింది.
Advertisements