Advertisement
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వృక్ష జాతులు ఉన్నాయి. వాటిల్లో కొన్ని ప్రత్యేకమైన జాతులకు చెందిన వృక్షాలు కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి. అలాగే ఆయా వృక్షాలు మనకు ఇక ప్రపంచంలో ఎక్కడ చూద్దామన్నా దాదాపుగా కనిపించవు. అంతటి వైవిధ్యతను కొన్ని వృక్షాలు కలిగి ఉంటాయి. అందుకనే వాటిని ప్రత్యేకమైన వృక్షాలని చెప్పవచ్చు. మరి ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఉన్న అలాంటి భిన్నమైన కొన్ని వృక్షాల గురించి ఇప్పుడు తెలుసుకుందామా..!
1. ఏక్సల్ ఎర్లాండర్‌సన్స్ సర్కస్ ట్రీ
ఈ వృక్షం కాలిఫోర్నియాలో ఉంది. చూసేందుకు ఇది జాలిలా అల్లుకున్న కాండాన్ని కలిగి ఉంటుంది. ఓ ప్రత్యేకమైన డిజైన్ మాదిరిగా మనకు ఈ వృక్షం కనిపిస్తుంది. ఇది ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
2. ఫ్లాంబొయంట్ ట్రీ
Advertisements
ఇది మడగాస్కర్‌లో ఉంది. చెట్టు నిండా ఎక్కడ చూసినా మనకు ఎరుపు రంగులో పూలు కనిపిస్తాయి. అందువల్ల పై నుంచి, దూరం నుంచి చూస్తే చెట్టుకు ఎరుపు రంగు వేశారేమోననిపిస్తుంది.
3. ఎల్ అర్బాల్ డి లా సబినా
కానరీ ఐల్యాండ్స్‌లో ఈ వృక్షం మనకు కనిపిస్తుంది. ఇది నేలకు ఒరిగి పెరుగుతుంది. అందువల్ల తుఫాన్ ధాటికి ఈ చెట్టు కూలిందేమోనని మనకు అనిపిస్తుంది.
4. బాటిల్ ట్రీ
Advertisement
ఈ వృక్షాలు మనకు నమీబియాలో కనిపిస్తాయి. ఈ చెట్టు ఆకారం చూసేందుకు సీసా మాదిరిగా ఉంటుంది. అందుకనే దాన్ని అలా పిలుస్తారు.
5. క్రూక్‌డ్ ఫారెస్ట్ ఆఫ్ గ్రిఫినో
చూసేందుకు ఏదో పార్క్‌లో వృక్షాలను అలా డిజైన్ రూపంలో అతికించారేమోనని అనిపిస్తుంది. కానీ అవి డిజైన్లు కాదు. నిజంగా వృక్షాలే. ఇవి పోలాండ్‌లో మనకు కనిపిస్తాయి.
6. పెజిబాయె పామ్
పామ్ వృక్షాల జాతిలో ఇదొకటి. దీని కాండం మొత్తం ముళ్లు ఉంటాయి. ఈ వృక్షాలు కోస్టారికా, నికారాగువాలలో మనకు కనిపిస్తాయి.
7. రెయిన్‌బో యూకలిప్టస్
నీలగిరి వృక్షాలకు చెందిన జాతిలో ఇదొకటి. దీని కాండంపై మనకు ఇంద్ర ధనుస్సు మాదిరిగా రంగులు కనిపిస్తాయి.
8. రోడోడెండ్రాన్
చూసేందుకు ఈ వృక్షం చిన్నగా కనిపిస్తుంది కానీ.. దీని వయస్సు 125 ఏళ్లు. ఎటు చూసినా ఈ వృక్షం నిండా పింక్ కలర్‌లో పువ్వులే మనకు కనిపిస్తాయి. న్యూజిలాండ్ లో ఈ వృక్షాలు మనకు కనిపిస్తాయి.
Advertisements