Advertisement
నిద్ర” కొంత మందికి శాపం, కొంతమందికి వరం. మరికొంత మందికి అవసరం… ఇక నిద్ర అనేది మనకు చాలా అవసరమైనా సరే ప్రేమ పులిహోర, స్మార్ట్ ఫోన్ తో ఎక్కువగా నిద్రకు దూరమవుతున్నాం. ఆరోగ్యకరమైన జీవితం కావాలి అనుకుంటే అందులో నిద్ర అనేది చాలా కీలకం. ఇక నిద్ర గురించి మనకు తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి.
Also Read:అసలు జీయర్ లు అంటే ఎవరు…? జీయర్ అని ఎందుకు పిలుస్తారు…?
హిప్నిక్ జెర్క్స్:
మనలో నిద్రలో ఉన్న సమయంలో సడెన్ గా పడిపోయినట్లు ఫీలింగ్ కలిగి ఒక జర్క్ లాంటి కుదుపుకు లోనవుతూ ఉంటాం. ఇది మన పక్కని వాళ్ళు కూడా గ్రహించలేరు. ఇది మనం సగం నిద్రలో ఉన్నపుడు లేదా అప్పుడే నిద్రలోకి జారుకున్నప్పుడు జరుగుతూ ఉంటుంది. దీనినే ‘హిప్నిక్ జెర్క్స్’ అని పిలుస్తూ ఉంటారు. యువకులలో చాలా ఎక్కువగా కనపడే ఈ అనుభూతి… ఇలా వస్తే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టు అనే భావన కూడా ఉంది. అయితే ఒత్తిడి ఎక్కువగా ఉన్నా, ఆందోళనతో కూడా అవి వచ్చే అవకాశం ఉంది. వయసు పెరిగే కొద్దీ తగ్గుతుంది.
Advertisements
Advertisement
కలల్ని మర్చిపోవడం:
మనం దాదాపుగా నిద్రలో వచ్చే కలలు సగానికి పైగా మర్చిపోతూ ఉంటారు. నిద్ర లేచిన 5 నిమిషాల్లోనే కల మర్చిపోవడం జరుగుతుంది.
నిద్ర లేమి -నొప్పిని తట్టుకునే శక్తి:
ఓ అధ్యయనం ప్రకారం వ్యక్తి నిద్రను సగానికి పైగా తగ్గిస్తే మాత్రం… నొప్పి తట్టుకునే శక్తి తగ్గిపోతుంది.
నిద్రలోకి జారుకునేందుకు కావలిసిన సమయం:
రాత్రి నిద్రలోకి జారుకోవడానికి మనకు 10-15 నిమిషాల వరకు పట్టే అవకాశం ఉంటుంది. కొందరు పడుకున్న వెంటనే నిద్రపోయే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఐదు నిమిషాల కంటే తక్కువ సమయంలో నిద్రలోకి జారుకుంటే మాత్రం… వారి శరీరం నిద్ర కోరుకుంటుంది అన్ని అర్ధం.
పురుషులు వర్సెస్ స్రీలు:
పురుషుల కంటే మహిళలు ఎక్కువగా నిద్రపోయే అవకాశం ఉంటుంది. దానికి కారణం మగవారితో పోలిస్తే వారు ఎన్నో టాస్క్ లు చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు మళ్ళీ ఫ్రెష్ గా లేవడానికి కాస్త ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది.
Advertisements
Also Read:యువరాజ్ గురించి తెలియని విషయాలు…!