Advertisement
పోలీసుల మధ్య అమాయకంగా కూర్చున్న ఈ టీచర్ పేరు అనామికా శుక్లా ఉత్తర ప్రదేశ్ లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (KGBV )లో ఫుల్ టైం సైన్స్ టీచర్‌గా పనిచేస్తుంది. నెలకు జీతం 30,769/- హ్యాపీగా జాబ్ చేసుకుంటూ నెల నెల జీతం తీసుకుంటూ దర్జాగా బతకొచ్చు.!
కానీ మేడమ్ స్కెచ్ వేరేలా వేసింది. నెల నెల 25 KGBV స్కూళ్ల నుండి జీతం డ్రా చేసుకుంది. అంటే నెలకు రూ.7.50 లక్షలు..ఇలా 13 నెలల పాటు కోటి రూపాయల వరకు డ్రా చేసింది.!
2020 ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్ ఎడ్యుకేషన్ అధికారులు KGBV స్కూళ్లలో టీచర్లకు సంబంధించి డిజిటల్ డేటాబేస్‌ను రూపొందిస్తున్న సమయంలో… 25 స్కూళ్లలో ఒకే పేరు మీద ఓ టీచర్ పనిచేస్తున్నట్లు వారు గుర్తించారు. ఎంక్వయిరీ చేయగా….. అనామికా శుక్లా 25 స్కూళ్లలో తన పేరు మీద రికార్డులను సృష్టించి నెల నెలా ఆ స్కూళ్ల నుంచి జీతం తీసుకుంటున్నట్లు గుర్తించారు.
దీని వెనుక పెద్ద హస్తం లేనిది. ఓ టీచర్ ఏకకాలంలో 25 చోట్ల పనిచేస్తున్నట్టు చూపించలేరు. టీచర్ స్కూల్ కే రాకుండా పిల్లలకు పాఠాలే చెప్పకుండా… సదరు టీచర్స్ శాలరీ బిల్స్ ను అకౌంట్ అధికారులకు ప్రిన్సిపాల్స్ ఎలా పంపించారు? అనేది కూడా పెద్ద మిస్టరీనే.!
స్టోరీలో ట్విస్ట్ :
Advertisements
Advertisement
తాజాగా నా సర్టిఫికేట్లు మిస్ యూజ్ అవుతున్నాయి. అసలైన అనామిక శుక్లాను నేను అంటూ ఓ మహిళ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. “నేను 2017 లో KGBV లో సైన్స్ టీచర్ పోస్ట్ కోసం అప్లై చేశాను.. కానీ తర్వాత అక్కడి నుండి ఎటువంటి ఫోన్ కాల్ రాలేదు.దాంతో నేను సెలెక్ట్ కాలేదని కామ్ గా ఉండిపోయాను. తాజాగా నా పేరుతో ఉన్న సర్టిఫికేట్లను ఉపయోగిస్తూ ఇంత అవినీతి జరిగింది అనే వార్తలు రావడంతో నేను కంప్లైంట్ ఇచ్చాను” అని ఓ మహిళ చెప్పుకొచ్చింది. తాను ఇంతవరకు ఏ స్కూల్లో కూడా టీచింగ్ చేయలేదని కూడా చెప్పింది సదరు మహిళ.
మరి అనామిక శుక్లా పేరుతో ఇప్పటి వరకు చలామణి అవుతున్న ఆ మహిళ ఎవరు? ఓకేసారి 25 చోట్ల జాబ్ ఎలా ఇచ్చారు? ఏకకాలంలో అన్ని చోట్ల టీచింగ్ ఎలా చేసింది? నకిలీ సర్టిఫికేట్స్ తో జాబ్ తెచ్చుకుంటే వెరిఫికేషన్ టైమ్ లో ఏం చేశారు? అంతా గందరగోళంగా ఉంది.! ప్రస్తుతానికైతే ఈ కేసు విషయమై దర్యాప్తు జరుగుతోంది. త్వరలోనే పూర్తి వివరాలు బయటికి వస్తాయి.!
Also Read: ఎందరో హృదయాలను కదిలించిన ఆ పాప కన్నీటి వెనుక కారణం?
Also Read: రైల్వే స్టేషన్ లో… రైలు వచ్చే సమయంలో ఈ యెల్లో లైన్ దాటకండి.!
Also Read: ఫోటో వెనుకున్న కథనం.
Advertisements
Also Read: ఆమె పరీక్షల కోసం..ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా స్పెషల్ బోటునే నడిపింది.!