Advertisement
“అన్నేసి చూడు -నన్నేసి చూడు” అంటుందట ఉప్పు…. అంతటి డిమాండ్ దానిది! మరి ఉప్పుకున్న డిమాండ్, ఉప్పును ఉత్పత్తి చేసే రైతులకుందా? అంటే లేదనే చెప్పాలి. వాళ్ల కష్టానికి…. వాళ్లకు దక్కే గిట్టుబాటుకు…మనం ఉప్పును కొనే రేట్ కు ఎక్కడ పోలికే ఉండదు.
ఒక ఎకరంలో 2 టన్నుల ఉప్పు తయారవుతుంది. అంటే దాదాపు 20 క్వింటాళ్ళు …1 క్వింటాకు ఎక్కువలో ఎక్కువ 100 రూపాయలు చెల్లిస్తారు …వర్షాకాలంలో క్వింటా కు 30 కూడా ఇస్తారు. సగటున 60 రూపాయలకు క్వింటా అనుకుంటే …. 20*60 = 1200 ఒక పంట చేతికి రావడానికి 45-60 రోజుల టైం పడుతుంది…. మార్చ్, ఏప్రిల్ , మే, జూన్ ఈ నాలుగు నెలలే ఉప్పు తయారీకి అనుకూలమైనవి. అంటే …. 3 సార్లు ఉప్పును ఉత్పత్తి చేస్తే … వీళ్ళకొచ్చే మొత్తం 3 *1200 = 36000/- దీనికోసం ….ముగ్గురు మనుషులు మండుటెండలో కష్టపడాల్సి ఉంటుంది.అలా టోకుగా కొన్న ఉప్పును కాస్త ప్రాసెస్ చేసి కేజీ ప్యాకెట్ 20 -40 కి మనకు అమ్ముతున్నాయ్… కార్పొరేట్ కంపెనీస్.
Advertisement
ఉప్పు గురించి మరికొన్ని విషయాలు :
- జాతీయ పోషకాహార సంస్థ సిఫార్సు ప్రకారం మనం రోజుకు ఆరు గ్రాముల కన్నా ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు. బట్ మనం సగటున ౩౦ గ్రాముల ఉప్పును తినేస్తున్నాం.
- మన దేశం లో 70 శాతానికి పైగా ఉప్పు గుజరాత్ నుండే ఉత్పత్తి అవుతుంది. ఉప్పు ఉత్పత్తి లో ఇండియా ప్రపంచంలో 3 వ స్థానంలో ఉంది.
- దేశ స్వతంత్ర పోరాటంలో ..ఉప్పు సత్యాగ్రహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Advertisements