Advertisement
1939 నుండి 1945 వరకు జరిగిన రెండో ప్రపంచ యుద్దంలో…..ప్రపంచ దేశాలన్నీ మిత్ర రాజ్యాలు – అక్ష రాజ్యాలుగా విడిపోయి యుద్దంలో పాల్గొన్నాయి. ఈ యుద్దంలో మిత్రరాజ్యాలు విజయం సాధించిన సంగతి తెలిసిందే.! అయితే ఈ యుద్ద గెలుపులో బంగాళదుంపలు సైతం మిత్ర రాజ్యాలకు సహాయం చేశాయి.!
నవ్వుతెప్పిస్తున్నప్పటికీ ఇది నిజం! –
ఫసిపిక్ మహా సముద్ర జలాల్లో జపాన్ సబ్ మెరైన్ గస్తీ కాస్తుంది. ఆ సమయంలోనే అమెరికా సబ్ మెరైన్ దానికి దగ్గరగా వచ్చింది. జపాన్ సబ్ మెరైన్ ను గమనించిన అమెరికా సైనికులు డెక్ లో దాచిన ఆయుధాలను తీసే ప్రయత్నం చేస్తున్నారు.
Advertisement
దానికి కాస్త సమయం పడుతుంది..ఈ లోపు జపాన్ వాళ్లు చూస్తే దాడికి దిగుతారని తలచి..అమెరికా మెరైన్ లోని ఓ సైనికుడు …తమ వెంట వండుకోడానికి తెచ్చుకున్న… బంగాళాదుంపలను జపాన్ మెరైన్ వైపు విసరడం స్టార్ట్ చేశాడు. దీంతో వాటిని గ్రెనేడ్లుగా భావించిన జపాన్ సైనికులు……తమ మెరైన్ లో పడిన బంగాళాదుంపలను తీసి…అమెరికన్ మెరైన్ వైపు విసురుతున్నారు.( అప్పటి గ్రెనేడ్ లు పేలడానికి 15-20 సెకండ్ల సమయం పట్టేది). ఇలా రెండు వైపులా కాసేపు ఆలుగడ్డల వార్ జరిగింది.
Advertisements
Advertisements
ఈ లోపు అమెరికన్ సైనికులు తమ మెరైన్ లో దాచిన ఆయుధాలను తీసి..జపాన్ మెరైన్ ను పేల్చేశారు. ఈ బంగాళదుంపలను గ్రెనేడ్లుగా భావించిన జపాన్ నేవీ సిబ్బంది వీటి మీద దృష్టి సారించి… తమ ఆయుధాలను వాడడం మర్చిపోయారు.! అలా ఆలుగడ్డలతో గెలిచిన యుద్దంలా….ఆ సముద్ర వార్ మిగిలిపోయింది.! బంగాళాదుంప పేరు చరిత్రలో నిలిచిపోయింది.