Advertisement
చూడడానికి చిన్న వస్తువే అయినప్పటికీ …..ఈ క్లాప్ బోర్డ్ ను ప్రాపర్ గా వాడితే సినిమాపై అనవసరంగా పెట్టే లక్షల రూపాయల వృథా ఖర్చుతో పాటు టైమ్ ను కూడా సేవ్ చేసుకోవొచ్చు ! పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్మూత్ గా అవ్వడానికి ఈ క్లాప్ బోర్ట్ చాలా ఉపయోగపడుతుంది! అదే సమయంలో ఎడిటర్ రిస్క్ ను తగ్గిస్తుంది.
లొకేషన్ ను బట్టి…. ఆర్టిస్టుల అందుబాటుని బట్టి… సినిమాకు సంబంధించిన సీన్లలను ఓ క్రమపద్దతిలో కాకుండా అనుకూలతను బట్టి తీస్తుంటారు. అలా తీసే సమయంలో క్లాప్ బోర్డ్ తో క్లాప్ కొట్టి తీస్తారు. ఆ క్లాప్ బోర్డ్ మీద రాసి ఉన్న పాయింట్స్ ఆధారంగా ఎడిటర్ కు సీన్లను పిక్ చేసుకోవడం…. ఓ వరుస క్రమంలో అమర్చడం ఈజీ అవుతుంది. దానితో పాటు క్లాప్ బోర్డ్ మీద ఉన్న అంశాల ఆధారంగా ఎలాంటి అవుట్ పుట్ రావాలో ముందుగానే ఓ అవగాహనకు వస్తాడు ఎడిటర్.
Advertisement
క్లాప్ బోర్డ్ మీద రాసి ఉండే అంశాలు:
Advertisements
డేట్ – లొకేషన్ -డే టైమ్ లేదా నైట్ టైమ్ – ఎక్స్టీరియర్ లేదా ఇంటీరియర్- సీన్ నెంబర్ – షాట్ నెంబర్ – టేక్ ……… వీటిని గమనించుకొని ది బెస్ట్ సీన్లను అంతే బెస్ట్ గా ఎడిట్ చేస్తుంటారు ఎడిటర్లు!
Advertisements
అంతేకాదు ఆ క్లాప్ బోర్డ్ ని కొట్టినప్పుడు వచ్చే సౌండ్ ఆధారంగా విజువల్ కు కరెక్ట్ గా సౌండ్ ఎక్కడ సింక్ చేయాలన్న విషయం కూడా ఈజీగా తెలుస్తుంది .