Advertisement
తెలుగు ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు సూపర్ సక్సెస్ అవుతాయి. అలాంటి జంటే వెంకటేష్- సౌందర్యల జంట. వీరిద్దరూ కలిసి 6 సినిమాలు చేస్తే అందులో 5 సూపర్ హిట్ అయ్యాయి. మిగిలిన ఆ ఒక్క సినిమాకు కూడా మంచి పేరు వచ్చినప్పటికీ కమర్షియల్ గా ప్లాప్ గా మిగిలింది.
వెంకటేష్ -సౌందర్య కాంబినేషన్లో వచ్చిన సినిమాలు -వాటి రిజల్ట్స్:
1) ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు:
1996 లో EVV సత్యనారాయణ డైరెక్షన్ లో వచ్చిన కామెడీ అండ్ సెంటిమెంట్ చిత్రం ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. 25 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఈ సినిమాకంటే ముందే సౌందర్య వెంకటేష్ తో సూపర్ పోలీస్ చిత్రంలో నటించినప్పటికీ ఆ సినిమాలో మెయిన్ హీరోయిన్ నగ్మ.
Advertisements
2) పవిత్రబంధం:
ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో 1996లో వెంకటేష్- సౌందర్యల కాంబినేషన్లో రిలీజైన మరో చిత్రం పవిత్ర బంధం… ఈ సినిమా తెలుగులో రిలీజ్ అయ్యాక…6 భాషల్లో రిమేక్ చేశారు.దీన్ని బట్టి చెప్పొచ్చు ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో. ఈ సినిమాతో వెంకీ- సౌందర్య కాంబినేషన్ పై క్రేజ్ పెరిగింది.
3) పెళ్లిచేసుకుందాం:
పవిత్ర బంధం హిట్ తర్వాత….ముత్యాల సుబ్బయ్య మళ్లీ వీరిద్దరినే హీరోహీరోయిన్లుగా 1997 లో తీసిన మూవీ పెళ్లిచేసుకుందాం. అత్యాచారానికి గురైన మహిళను హీరో తన భార్యగా చేసుకుంటాడు….ఈ కథలో అనేక ఎమోషన్స్ ను జొప్పించి హిట్ కొట్టాడు దర్శకుడు. ఈ చిత్రం 10 కేంద్రాల్లో 100 రోజులు ఆడి హిట్ గా నిలిచింది.
Advertisement
4) రాజా:
ఉన్నిడతిల్ ఎన్నై కొడుతేన్ అనే తమిళ సినిమాను తెలుగులో ముప్పలనేని శివ రిమేక్ చేశాడు…ఆ సినిమానే రాజా…. సౌందర్య వెంకీ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. వెంకటేష్ సౌందర్యలో పోటీపడి నటించారు. 71 కేంద్రాల్లో 100రోజులాడి 15 కోట్లను వసూలు చేసి రికార్డ్ సృష్టించింది ఈ సినిమా.
5) జయం మనదేరా:
ఎన్.శంకర్ డైరెక్షన్ లో 2000 సంవత్సరంలో వచ్చిన మూవీ జయం మనదేరా.లండన్ లో గైడ్ గా వెంకటేష్ టూరిస్ట్ గా వచ్చిన సౌందర్య ….వీరిద్దరి మధ్య ప్రేమను అద్భుతంగా చూపించాడు శంకర్ …సౌందర్య వెంకీ కాంబో లో వచ్చిన ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. 34 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.
6) దేవీపుత్రుడు:
2001లో కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఫాంటసీ డ్రామా దేవీపుత్రుడు. ఈ సినిమాను దాదాపు 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. అప్పటి వరకు వెంకటేష్ సినిమాల్లో ఎక్కువ బడ్జెట్ ఈ సినిమాదే. కథపరంగా బాగానే ఉన్నా….కమర్షియల్ గా ఈ సినిమా ప్లాప్ గా నిలిచింది. సక్సెల్ ఫుల్ జోడీగా కొనసాగుతున్న వెంకటేష్ -సౌందర్య జంటకు ఈ సినిమాతో ఫుల్ స్టాప్ పడింది. ఈ సినిమా తర్వాత వారి కాంబినేషన్లో మరో సినిమా రాలేదు.
Advertisements