Advertisement
కరోనా వైరస్ బారిన పడే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది.. కరోనా పేరు వింటున్న డే వన్ నుండి మనం PPE కిట్లు, పారాసిటమాల్ ట్యాబ్లెట్స్, వెంటిలేటర్స్ ఇలా రకరకాల పేర్లు వింటున్నాం.. వెంటిలేటర్ సౌకర్యం లేక రోగులు మరణిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి..అసలింతకీ వెంటిలేషన్ అంటే ఏంటి? ఈ వెంటిలేటర్ మన ఆరోగ్యం మెరుగుపర్చడంలో ఎలా తోడ్పడుతుంది… తదితర విషయాలు మీకోసం..
వెంటిలేటర్లు అంటే ఏంటి??
వెంటిలేటర్ అంటే కృత్రిమంగా శ్వాస అందించే మెషీన్..కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా శ్వాసవ్యవస్థపై పడుతుంది..ఈ వైరస్ బారిన పడిన వారికి దగ్గు,జలుబు, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడడం లాంటి లక్షణాలు ఉంటాయి..ఊపిరితిత్తులు పనిచేయనంతగా తీవ్ర పరిస్థితి ఎదురైతే, శరీరానికి అవసరమైన శ్వాస అందించే పనిని వెంటిలేటర్లు చూసుకుంటాయి.కృత్రిమ శ్వాస ద్వారా రోగి వ్యాధితో పోరాడడానికి, నయం అవ్వడానికి సమయం లభిస్తుంది..

Image Courtesy : BBC
వెంటిలేటర్ల పని ఏంటి??
Advertisement
వెంటిలేషన్ అంటే వాయు ప్రసరణ..వెంటిలేటర్ల ద్వారా రోగికి రెండు రకాలుగా వాయు ప్రసరణ అందిస్తారు..
Advertisements
- రోగికి గొంతు ద్వారా ఊపిరితిత్తులలోకి గొట్టం వేస్తారు..దీని ద్వారా రోగికి ఆక్సిజన్ అందిస్తారు..మరియు దీనికే అనుసంధానించబడిన మరో గొట్టం ద్వారా రోగి వదిలిన కార్బన్ డయాక్సైడ్ బయటకి పోతుంది.
- మరో మార్గం ఏంటంటే ముక్కు,నోరుకి కలిపి ఒక మాస్క్ లాంటి దానితో మూస్తారు..దీని ద్వారా బయట నుండి ఆక్సిజన్ అందిస్తారు..మనం సినిమాల్లో ఎక్కువగా ఇలాంటి వాటిని చూస్తాము…. వీటిల్లో గొంతులోకి గొట్టం వేయరు..
- రోగి శరీర ఉష్ణోగ్రతకు సరిపోయేలాగా ఈ గాలికి వేడిని, తేమను జతచేసే “హుమిడిఫైయర్” పరికరం కూడా ఈ వెంటిలేటర్లలో ఉంటుంది.
వెంటిలేటర్లను సరిగ్గా ఉపయోగించకపోతే రోగిని ప్రాణాపాయ స్థితిలోకి నెట్టేస్తాయి..కాబట్టి నిఫుణుల సమక్షంలోనే రోగికి వెంటిలేషన్ ద్వారా వైద్య సదుపాయం అందిస్తారు..నిజానికి కరోనా బారిన పడుతున్న వారిలో చాలామందికి లక్షణాలే కనపడట్లేదు..మరికొంతమందికి మందులతోనే నయం అవుతుంది..అతి కొద్దిమందికి మాత్రమే వెంటిలేటర్ అవసరం పడుతుంది..అది దీర్ఘకాలికంగా శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి మాత్రమే..కాబట్టి వీలైనంత హెల్తీ ఫూడ్ తీసుకుంటూ..ఇమ్యునిటి పవర్ ని పెంచుకుంటూ బతకడమే.. కరోనాకి సరైన మందు.!
Advertisements