Advertisement
తెలిసో తెలియకో….వ్యభిచారకూపంలో ఇరుక్కుపోయిన చాలా మంది జీవితాల్లో కరోనా మార్పు తీసుకొచ్చింది. ఇన్నాళ్లు వేశ్యలుగా బతికిన వారు ఇప్పుడు గౌరవప్రద వృత్తిలోకి మారుతున్నారు. ఆరంభంలో కష్టమౌతున్నప్పటికీ కొత్త వృత్తి బాగుందనే అంటున్నారు వారు.
రాణి :
నా 16 ఏళ్ల వయస్సుల్లో ఈ వృత్తిలోకి వచ్చాను.అక్కడ తిండి పెట్టి నెలకు 15 వేలు ఇస్తారు. కానీ ఒళ్లంతా హునం అవుతుంది.! ఒక్కోసారి ఆ నొప్పులకు తినాలని కూడా అనిపించదు. కరోనా కారణంగా మా బిజినెస్ బంద్ అయ్యింది. దీంతో నేను ఇక్కడి NGO సహాయంతో అగరొత్తులు తయారు చేస్తున్నాను. రోజుకు 200 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు సంతోషంగా ఉంది.
Advertisement
సోని:
ఓ బ్రోకర్ నన్ను ఇక్కడ అమ్మేసి వెళ్లాడు. అప్పటి నుండి ఈ వృత్తిలోనే ఉన్నాను. నా దగ్గరికొచ్చే కస్టమర్ల సంఖ్యను బట్టి నాకు కమీషన్ ఇచ్చేవాళ్లు. కానీ ఎంత డబ్బు సంపాదించినా అది పాపపు సొమ్ము అనే ఫీలింగ్ ఉండేది. లాక్ డౌన్ టైమ్ లో అది బంద్ అవ్వడంతో నేను అగరొత్తుల పనిలోకి వచ్చాను . ఇప్పుడు ఎటువంటి బాధ లేకుండా ప్రశాంతంగా ఉంది.!
Advertisements
Advertisements
ఇలా చాలా మంది స్వచ్చందంగా తమ వృత్తిని మార్చుకోడానికి రెడీగా ఉన్నారు కానీ అవకాశాలే లేవు! కొన్ని NGO లు ముందుకొచ్చి ముంబాయ్ రెడ్ లైట్ ఏరియాలో ఉండే వారికి కొత్త ఉపాధిని పరిచయం చేసి వారి జీవితంలో మార్పులకైతే శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఉపాధి చూపిస్తే…ఆ చీకటి జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తాయి.!