Advertisement
ఒకప్పుడు స్టార్ హీరోల ఫ్యామిలీ నుంచి వారి కొడుకులు హీరోలుగా వచ్చి ఇండస్ట్రీలో వారి వారసత్వం కొనసాగించే వారు . వారి ఫ్యామిలిలో లేడీస్ ని మాత్రం ఇండస్ట్రీ కి దూరంగా ఉంచేవారు . కానీ ప్రస్తుతం ట్రెండ్ మారిపోయింది . వారి కొడుకుల కంటే బాగా వారి కూతుర్లే ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా , ప్రొడ్యూసర్స్ గా రాణిస్తున్నారు . అలా ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణిస్తున్న హీరోల కూతుర్లెవరో ఇప్పుడు చూద్దాం!
1.నిహారిక -నాగబాబు:
ఈ మెగా ఫ్యామిలీ డాటర్ నిహారిక 2016లో రిలీజైన ఒక మనసు సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు వచ్చారు కానీ మొట్టమొదటిగా వచ్చిన హీరోయిన్ మాత్రం నిహారిక నే . ఈమె ఇప్పటివరకు ఒక మనసు , సూర్యకాంతం , హ్యాపీ వెడ్డింగ్ , ఒరు నల్లనాళ్ పాత్తు సొల్ఱేన్ ,సినిమాలతో పాటు చిరంజీవి సినిమా సైరా నర్సింహారెడ్డి లో కూడా నటించింది .
2. శివాత్మిక & శివాని – డా. రాజశేఖర్:
హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక విజయ్ దేవరకొండ తమ్ముడు తో నటించిన దొరసాని అనే సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయింది . అలాగే రాజశేఖర్ చిన్న కూతురు శివాని కూడా ఇండస్ట్రీలోకి కల్కి సినిమాతో ప్రొడ్యూసర్ గా అడుగుపెట్టింది.
Advertisements
3. మంచు లక్ష్మి – మోహన్ బాబు:
మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ హీరోయిన్ గా మరియు ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో చక్కగా రాణిస్తుంది.
ఆమె నటించిన సినిమాలు:
• గుండెల్లో గోదారి
• బుడుగు
• దొంగాట
• w/o రామ్
• లక్ష్మీ బాంబ్
• చందమామ కథలు
4. శ్రీదేవి , వనిత & ప్రీతి – విజయ్ కుమార్:
Advertisement
తమిళ నటుడు విజయ్ కుమార్ ముగ్గురు కూతుర్లైన శ్రీదేవి , వనిత , ప్రీతి వీరు ముగ్గురు తెలుగు ,తమిళ భాషల్లో చాలా సినిమాలలో హీరోయిన్స్ నటించారు.
ఇతర భాషల్లో….. హీరోయిన్లుగా రాణిస్తున్న ఒకప్పటి స్టార్ హీరోల కూతుర్లు!
● ఐశ్వర్య -యాక్షన్ కింగ్ అర్జున్
● వరలక్ష్మి – శరత్ కుమార్:
● ఐశ్వర్య రాజేష్ – రాజేష్:
● శృతి హాసన్ & అక్షర – కమల్ హాసన్:
● సారా ఆలీ ఖాన్ – సైఫ్ అలీ ఖాన్:
● శ్రద్దా కపూర్ – శక్తి కపూర్:
● సోనాక్షి సిన్హా – శత్రుఘ్న సిన్హా:
● సోనమ్ కపూర్ – అనిల్ కపూర్:
● అతియా శెట్టి – సునీల్ శెట్టి:
Advertisements