Advertisement
నా జీవితం గురించి ఆలోచిస్తే నాకే భలే నవ్వొస్తుంది.! ఎలా స్టార్ట్ అయిన జీవితం ఎలా గడుస్తుందో పోల్చుకుంటుంటే విచిత్రంగా అనిపిస్తుంది. అప్పుడు నా వయసు 20. నేనో ఆటో డ్రైవర్ ని….కిరాయికి ఆటో తీసుకోవడం పొద్దంతా నడపడం …సాయంత్రం ఓనర్ కి ఆటో అప్పజెప్పి …మిగిలిన డబ్బుతో జల్సా చేయడం ఇలా సాగేది నా లైఫ్.
నాకు తెలిసిన ఒకతను…”పొద్దంతా ఆటో ఏం నడుపుతావ్ కానీ …నాకు తెలిసిన వాళ్ళకు మొబైల్ కాంటీన్ ఉంది. ఆ ట్రక్ నడిపాడానికి ఓ డ్రైవర్ కావాలి. రోజు సాయంత్రం 4 -9 ఉంటే చాలు ౩౦౦/- ఇస్తార” ని చెప్పాడు. దీంతో నేను ఆ జాబ్ లోకి షిఫ్ట్ అవ్వాలని ఫిక్స్ అయ్యాను.
Advertisement
మరునాడు అడ్రెస్స్ కనుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఓ 50 ఏళ్ళ పెద్దావిడ టిఫిన్స్ చేయడం , 18 ఏళ్ళ వాళ్ళ కూతురు వాటిని అమ్మడం., నేను వారికి సహాయపడడం…ఇలా 2 ఇయర్స్ గడిచింది. ఈ క్రమంలో మా ఇద్దరి మధ్య ప్రేమ స్టార్ట్ అయ్యింది. టిఫిన్స్ బిజినెస్ తో పాటే మా ప్రేమ కూడా పెరుగుతూ వచ్చింది. అదేంటో మా ప్రేమ విషయం తెలియకుండానే వాళ్ళ అమ్మ నాతో మా అమ్మాయిని చేసుకో అనేసింది. బహుశా అది నా మంచితనాన్ని చూసి కావొచ్చు.. ఇంకేముంది 6 నెలల్లో మా పెళ్లయిపోయింది.
ఎక్కడైతే మొబైల్ కాంటీన్ నడిపామో…అక్కడే పెద్ద రెస్టారెంట్ ఓపెన్ చేసాం. ఆ రెస్టారెంట్ కి మా కూతురు పేరు ‘అమృత’ అని పెట్టాం. బాధాకరమైన విషయం ఏంటంటే మా అత్త ఇప్పుడు మాతో లేరు.
Advertisements
Also Read: అందరూ తిట్టారు.., కానీ తను నన్ను నమ్మింది.! నమ్మకమిచ్చిన భార్యతో తొలి సెల్ఫీ.!
Also Read: మీరనుకుంటున్నట్టు రోమాంటిక్ ఫోటో కాదిది. అంతులేని శోకం దాగుంది..అదేంటో తెలుసా?
Also Read: ఆయన కలెక్టర్ ..ఆమె డాక్టర్ …పెళ్లిలో సార్ అడిగిన కట్నం హైలెట్ .!
Advertisements
Also Read: ఆమె ట్రైన్ లో బయలుదేరింది..ఇక్కడ ఇతనికి టెన్షన్ స్టార్ట్ అయ్యింది….నిజమైన ప్రేమంటే ఇదేనేమో.!