Advertisement
విజయ్ దేవరకొండ…. తెలుగు సినిమాలో ఓ సంచలనం. ఆటిట్యూడ్ కా బాప్! ఆయన సినిమాలు కూడా అంతే వైవిధ్యం.! సినిమాల్లో నిలదొక్కుకోడానికి చాలా కష్టపడ్డ విజయ్…. పెళ్లిచూపులు తర్వాత వెనుతిరిగి చూడలేదు.! అర్జున్ రెడ్డి, గీతాగోవిందం సినిమాలతో స్టార్ హీరోల సరసన చేరాడు.
5 లక్షలకు తన తొలి సినిమాను చేసిన విజయ్….ఎదిగిన క్రమం ఇప్పుడు చూద్దాం!
పెళ్లిచూపులు – 5 లక్షలు
చిన్న బడ్జెట్ సినిమా…. హీరోగా ఫస్ట్ ఛాన్స్. 5 లక్షల రెమ్యునరేషన్ తీసుకొని సినిమా ఒప్పుకున్నాడు. తన నటనకు ఫుల్ మార్క్స్ పడ్డాయి.! దాంతో బోలెడన్ని ఆఫర్స్ వచ్చిపడ్డాయి! తరుణ్ భాస్కర్ ఈ సినిమాకు డైరెక్టర్!
ద్వారక – 20 లక్షలు
పాత్ర వైవిధ్యంగా ఉన్న…సినిమా నిరాశపర్చింది.!
అర్జున్ రెడ్డి- 5 లక్షలు
ఈ ప్రాజెక్ట్ కు ముందే సైన్ చేయడం కారణంగా రెమ్యునరేషన్ పెంచలేదు.! ఈ సినిమా మాత్రం విజయ్ లైఫ్ ను టర్న్ చేసిన సినిమాగా చెప్పొచ్చు! ఈ సినిమా లాభాల్లో మాత్రం విజయ్ కు షేర్ ఇచ్చారట.!
Advertisements
గీతా గోవిందం – 5 లక్షలు
ఇది అర్జున్ రెడ్డికి ముందు సైన్ చేసిన సినిమా కావడంతో ….అప్పటికీ తన రెమ్యూనరేషన్ ను పెంచలేదట విజయ్.! తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరింది. విజయ్ గ్రాఫ్ ను పీక్స్ కు తీసుకెళ్లింది!
Advertisement
Advertisements
నోటా – 3 కోట్లు
2018 లో తమిళ్ , తెలుగు లో రిలీజ్ అయిన ఈ సినిమాకు విజయ్ తీసుకున్న రెమ్యూనరేషన్ 3 కోట్లు.! పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగిన ఈ సినిమాపై మిక్స్ డ్ ఒపినీయన్స్ వచ్చాయి.!
టాక్సీవాలా – 5 కోట్లు
రాహుల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హై ఎక్స్ పెక్టేషన్స్ మద్య విడుదలైంది. కానీ అనుకున్నంత సక్సెస్ కాలేదు.! యావరేజ్ సినిమాగా నిలిచిపోయింది.
డియర్ కామ్రెడ్ – 10 కోట్లు
భరత్ కమ్మ డైరెక్షన్ లో 2019 లో విడుదైన విజయ్ చిత్ర డియర్ కామ్రెడ్….ఈ సినిమా ప్లాప్ అయ్యింది! ఈ చిత్రంలో విజయ్ నటన అద్భుతంగా ఉంటుంది.
వరల్డ్ ఫేమస్ లవర్ – 10 కోట్లు
అర్జున్ రెడ్డి రేంజ్ రొమాన్స్ లతో ట్రైలర్స్ ను రిలీజ్ చేసినప్పటికీ ఈ సినిమా విజయ్ కెరీర్లోనే ఫస్ట్ డిజాస్టర్ గా మిగిలింది.
ఫైటర్ – 12 కోట్లు
పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో రాబోతున్న చిత్రం ఫైటర్… మామూలుగానే పూరీ హీరోలను ఎలివేట్ చేసే స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. అలాంటిది విజయ్ తో సినిమా అంటే అభిమానులు మాత్రం భారీగానే అంచనాలు పెట్టకున్నారు.!