Advertisement
బాలకృష్ణ అండ్ విజయశాంతి…..క్రేజీ కాంబినేషన్., వీరి కాంబోలో వచ్చిన సినిమాల్లో 90 శాతం సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. వీరిద్దరు కలిసి 17 సినిమాలు చేస్తే …….అందులో 16 సినిమాలు హిట్స్ గా నిలిచాయి…ఒక్కటి మాత్రమే డిజాస్టర్ గా మిగిలింది.90’s వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ కు పండగే..ముఖ్యంగా నిర్మాతలు చాలా ప్రశాంతంగా కనిపించేవారు. హిట్టు గ్యారెంటీ అనే లెక్కల్లో ఉండేవారు. కథానాయకుడుతో ప్రారంభమైన వీరి జైత్రయాత్ర నిప్పురవ్వ వరకు కొనసాగింది.
1) కథానాయకుడు:
తొలిసారి బాలకృష్ణ,విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా కథానాయకుడు. మురళీ మోహన్ రావు ఈసినిమాకు దర్శకత్వం వహించాడు.
సినిమా రిజల్ట్ : సూపర్ హిట్
2) పట్టాభిషేకం
1985 లో వీరి కాంబినేషన్ లో ….. కే రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన సినిమా “పట్టాభిషేకం”
సినిమా రిజల్ట్ : యావరేజ్
Advertisements
3)ముద్దుల క్రిష్ణయ్య
1986 లో వీరి కాంబోలో వచ్చిన మరో చిత్రం ముద్దుల క్రిష్ణయ్య. ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు.
సినిమా రిజల్ట్ : బ‌్లాక్ బస్టర్
4) దేశోద్ధారకుడు
1986లోనే వీరి కాంబోలో రిలీజైన మరో చిత్రం…. దేశోద్ధారకుడు. SS రవిచంద్ర ఈ సినిమాకు డైరెక్ట్ చేశాడు.
సినిమా రిజల్ట్ : హిట్
5) “అపూర్వ సహోదరులు”
1986లోనే వీరి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం అపూర్వ సోదరులు. రాఘవేంద్రరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో బాలయ్య డబుల్ రోల్చే యగా… విజయశాంతి, భానుప్రియలు హీరోయిన్లుగా నటించారు.
సినిమా రిజల్ట్ : సూపర్ హిట్
6) భార్గవ రాముడు
1987 లో రిలీజైన ఈ సినిమాను కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు.
సినిమా రిజల్ట్ : యావరేజ్
7)సాహస సామ్రాట్
కే రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేసిన ఈ సినిమా టైటిల్ తో వివాదంలో నిలిచింది. మొదట సామ్రాట్ అనే టైటిల్ తో ఈ మూవీని స్టార్ట్ చేశారు. కానీ సామ్రాట్ అనే టైటిల్ ను అప్పటికే కృష్ణ రిజిస్టర్ చేసుకోగా వివాదం తలెత్తింది.
సినిమా రిజల్ట్ : డిజాస్టర్
8)భానుమతి గారి మొగుడు
కోందడరామిరెడ్డి ఈ సినిమాకు డైరెక్షన్ వహించారు
సినిమా రిజల్ట్ : యావరేజ్
Advertisement
9) మువ్వ గోపాలుడు
కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అరువడైనాల్ అనే తమిళ్ సినిమాకు రిమేక్..తమిళ్ లో హిట్ అయిన ఈ మూవీ తెలుగులో బ్లాక్ బస్టర్ అయ్యింది.
సినిమా రిజల్ట్ : బ‌్లాక్ బస్టర్
10) ఇన్స్పెక్టర్ ప్రతాప్
1988 లో వీరి కాంబోలో ఒకేఒక్క సినిమా “ఇన్స్పెక్టర్ ప్రతాప్” రిలీజైనది . ముత్యాల సుబ్బయ్య ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు.
సినిమా రిజల్ట్ : యావరేజ్
11) భలేదొంగ
కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలయ్య, విజయశాంతి కాంబో లో వచ్చిన మరో చిత్రం భలే దొంగ.
సినిమా రిజల్ట్ : హిట్
12) ముద్దుల మావయ్య
బాలయ్య విజయశాంతి కాంబోలకు కంటిన్యూస్ హిట్స్ ను ఇస్తున్న కోడి రామకృష్ణ మరోసారి ఈ జంటకు తన ముద్దుల మామయ్య సినిమాతో భీభత్సమైన క్రేజ్ ను తీసుకొచ్చారు.!
సినిమా రిజల్ట్ : ఇండస్ట్రీ హిట్
13)ముద్దులమేనల్లుడు
కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తమిళ్ సినిమా తంగమన రాసా కు రిమేక్
సినిమా రిజల్ట్ : యావరేజ్
14) లారీ డ్రైవర్
1990లో బి.గోపాల్ డైరెక్షన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ లారీ డ్రైవర్
సినిమా రిజల్ట్ : బ‌్లాక్ బస్టర్
15) తల్లిదండ్రులు
ఈ సినిమాను తాతినేని రామారావు డైరెక్ట్ చేశారు.
సినిమా రిజల్ట్ : హిట్
16) రౌడీ ఇన్స్పెక్టర్
1992 లో బి.గోపాల్ దర్శకత్వంలో బాలయ్య బాబు, విజయశాంతి కాంబో లో వచ్చిన మరో చిత్రం రౌడీ ఇన్స్పెక్టర్
సినిమా రిజల్ట్ : బ‌్లాక్ బస్టర్
17) నిప్పురవ్వ
1993లో కోదండరామిరెడ్డి డైరెక్టర్ గా బాలకృష్ణ స్వీయ నిర్మాణంలో రిలీజైన చిత్రం నిప్పురవ్వ….ఈ సినిమా విడుదల నాడు బాలకృష్ణ మరో సినిమా బంగారు బుల్లోడు రిలీజ్ అవ్వడం విశేషం!
సినిమా రిజల్ట్ : యావరేజ్
Advertisements