Advertisement
సాధారణంగా అంగ వైకల్యం లేదా ఇతర ఏదైనా మెడికల్ కండిషన్‌తో జన్మించిన వారిని సమాజంలోని కొందరు హేళన చేస్తారు. అలాంటి వారిని అవమానిస్తారు. దీంతో అలాంటి వారు ఎప్పుడూ బయట తిరిగేందుకు ఇష్టపడరు. అయితే అలాంటి ఓ బాలున్ని మాత్రం అక్కడి వారందరూ వినాయకుడికి ప్రతిరూపంగా భావించి పూజిస్తున్నారు. అవును.. నిజమే..
పంజాబ్‌లోని జలంధర్ ప్రాంతానికి చెందిన ప్రంషు అనే బాలుడు అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఎంతో మంది డాక్టర్లు అతన్ని పరీక్షించారు, కానీ అతనికి ఉన్న వ్యాది ఏమిటో అర్థం కాలేదు. ఈ క్రమంలో అతనికి నడక కూడా సరిగ్గా వచ్చేది కాదు. ఎత్తు పెరగలేదు. నుదురు భాగం పెద్దదిగా ఉండేది. చూసేందుకు వినాయకుడి తలను పోలి ఉంటుంది. దీంతో అతన్ని గణేషుడికి ప్రతిరూపంగా భావించి పూజించడం మొదలు పెట్టారు. అతను నిజంగానే వినాయకుడని భావించి అతనికి పూజలు చేస్తున్నారు.
Advertisements
Advertisement
ఇక ప్రంషును గ్రామంలోని వారందరూ దేవుడిలా భావించి పూజిస్తుండే సరికి అతని తల్లిదండ్రులు కూడా అలాగే చేస్తున్నారు. ఈ క్రమంలో నిత్యం అతని ఇంటికి వచ్చి అతని ఆశీస్సులు తీసుకుంటుంటారు. అయితే నిజానికి ప్రంషు ఆకారం అలా ఉంది కానీ చాలా అణకువ కలిగిన బాలుడు. అందరినీ ప్రేమిస్తాడు. ఇతరులపై జాలి చూపిస్తాడు.
Advertisements
అతను అలా ఉండడం వల్ల నిజానికి సమాజంలో కొందరు అతన్ని హేళన చేసి ఉండేవారు. కానీ అతన్ని పూజించడం ఆశ్చర్య పరుస్తోంది. అయితే అతన్ని అలా పూజించడం ఏమోగానీ అతని పట్ల సమాజం మంచిగా ప్రవర్తిస్తుందని అతని తల్లిదండ్రులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. స్కూల్‌లో, బయట ఎక్కడైనా సరే అతను కనిపిస్తే గ్రామస్థులు పూలు సమర్పించి నమస్కరిస్తారు. ప్రంషు కూడా వారి నమస్కారాన్ని కాదనలేక ఆశీర్వదిస్తాడు. కాగా ఈ విషయం తెలిసి చుట్టు పక్కల గ్రామస్థులు కూడా అతన్ని చూసి పూజించేందుకు అతని ఇంటికి వస్తున్నారు. అతను నిజంగా వినాయకుడేనని నమ్మి పూజలు చేస్తున్నారు. ఏది ఏమైనా.. సమాజంలో ఇలాంటి వారికి హేళనలు, అవమానాలు కాకుండా.. ఇలా పూజలు దక్కడం నిజంగా అభినందనీయం..