Advertisement
2011లో ఇండియా V/s వెస్టిండీస్ 4వ వన్డే కు ముందు ఇండియన్ క్రికెట్ టీమ్ ప్రాక్టీస్ చేస్తుంది… ఆ ప్రాక్టీస్ లో టీమ్ ఇండియా బ్యాట్స్ మన్ కు బౌలింగ్ చేస్తున్నారు మద్య ప్రదేశ్ స్టేట్ ప్లేయర్స్….ఆ ప్రాక్టీస్ సెషన్ లో ఓ యువ బౌలర్ విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేస్తున్నాడు….
- 1st బాల్ – అవుట్ స్వింగర్….. కోహ్లీ దానిని వదిలేశాడు.
- 2nd బాల్ – ఆఫ్ స్టంప్ …. ఆ బాల్ ని డిఫెన్స్ చేశాడు.
- 3rd బాల్ – మళ్ళీ ఆఫ్ స్టంప్ లో తక్కువ స్పీడ్ తో వెళ్ళింది. డిఫెన్సు చేయబోయి మిస్ చేసాడు. వెనకాల కీపింగ్ చేస్తున్న పార్థివ్ పటేల్ చేతుల్లోకి వెళ్ళింది . విరాట్ వెంటనే షాక్ తో నావైపు చూసాడు . ఎందుకంటే అది చాలా మంచి డెలివరీ!
- 4th బాల్ – మిడిల్ స్టంప్ …. క్రీజ్ దాటి ముందుకు వచ్చిన కోహ్లీ ఆ బాల్ ను సిక్స్ కొట్టాడు!
- 5th బాల్ – గుడ్ లెంత్ బాల్ ….. కోహ్లీ ట్రేడ్ మార్క్ అయిన ఫ్లిక్ తో బౌండరీ కొట్టాడు.
Advertisement
ప్రాక్టీసు అయిపోయాక…. నేను కోహ్లీతో మాట్లాడటం జరిగింది . సార్ నా బౌలింగ్ ఎలా ఉందన్నాను? అతను చాలా కూల్ గా గుడ్ అంటూనే…. ఫ్రిజ్ నుండి వాటర్ బాటిల్ తీసి… వాటర్ తాగుతారా అని అడిగాడు . నేను ఆశ్చర్యపోయాను.! టీమ్ ఇండియా బెస్ట్ క్రికెటర్ నాకు వాటర్ అందించడమేంటని?
Advertisements
తర్వాత ప్లేయర్స్ అందరూ డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లి విశ్రాంతి తీసుకుంటుంటే , విరాట్ మాత్రం ఫీల్డింగ్ ప్రాక్టీసు చేయడానికి వెళ్ళాడు. అతని కృషి ,పట్టుదలే అతన్ని సక్సెస్ కు కారణమని నేను బలంగా నమ్ముతాను.
Advertisements