Advertisement
QR కోడ్” కరోనా టైం లో మనం ఏదోక సందర్భంలో దీన్ని వాడే ఉంటాం. కరోనాతో కాంటాక్ట్ లెస్ చెల్లింపులు పెరిగాయనే మాట వాస్తవం. వాటర్ బాటిల్ కొనుగోలు చేసినా సరే ఏదోక యాప్ కోసం గానూ దీన్ని ఎక్కువగా వాడుతున్నాం. ఇక ఇది వాడే టైం లో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గత వేసవిలో బెటర్ బిజినెస్ బ్యూరో… కీలక వార్నింగ్ ఇచ్చింది. స్కాం చేసే వాళ్ళు వినూత్న మార్గాల్లో QR కోడ్‌లను ఎక్కువగా దుర్వినియోగం చేస్తున్నారని హెచ్చరికలు జారీ చేసింది.
సైట్ లో చెల్లింపులు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరించింది. ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
ఇక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒక్కసారి చూస్తే…
Advertisement
QR కోడ్‌తో ఎంగేజ్ చేసే ముందు, కోడ్‌ను మార్చడం అనేది సాధ్యం కాదు. దానిపై అధికారిక స్టిక్కర్ ఉన్నదో లేదో చూసుకోవాల్సి ఉంటుంది.
Advertisements
ఇక మరో ప్రధాన సలహా ఏంటీ అంటే యాప్ స్టోర్ నుండి కాకుండా QR కోడ్ ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేయకుండా ఉండటం చాలా మంచిది.
QR కోడ్ స్కానర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయవద్దు. దీని ద్వారా మీ డివైజ్ లో మాల్వేర్‌ను డౌన్‌లోడ్ చేసే ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంటుంది. చాలా ఫోన్ లకు ఈ యాప్ లు డీఫాల్ట్ గా ఇస్తున్నారు.
Advertisements
ఏదైనా సైట్ లో క్యూఆర్ కోడ్ ఉంటే మాత్రం ఏ విధంగా కూడా పే చేయవద్దు. అలాంటి వాటికి ధోరమ్గాఉన్దాల్సిన అవసరం ఉంది. మీకు క్యూ ఆర్ కోడ్ ఏ రూపంలో వచ్చినా సరే పంపిన వారి నుంచి క్లారిటీ తీసుకున్న తర్వాతే పే చేయండి.