Advertisement
ఒక కారు తయారీ కంపెనీ యజమాని తన కంపనిలోని ఒక ఇంజనీర్ కు ‘ఒక మంచి కారును డిజైన్ చేసి తయారు చేయమని’ ఒక పని అప్ప చెప్పాడు. ఆ ఇంజనీర్ ఒక అద్భుతమైన కారును తయారుచేసి సిద్ధంగా ఉంచి యజమానికి కబురుపెట్టాడు. యజమాని వచ్చి ఆ కారును చూసి ఆశ్చర్యానందాలను వ్యక్తం చేయడంతోపాటు అతని పనితనాన్ని చాలా మెచ్చుకున్నాడు.
ఆ కారును కంపెనీ తయారు ప్రదేశం నుండి షోరూంకు తీసుకొద్దామని చూసేసరికి ప్రవేశ ద్వారం కన్నా కారు ఒక్క అంగుళం ఎత్తుగా ఉంది.కారును తయారు చేసేముందు ఈ విషయం గమనించలేక పోయినందుకు ఇంజనీర్ లోలోపల చింతించి తయారీ ప్రాంతం నుంచి వెలుపలకు కారును ఎలా తీసుకోవాలో ఆ యజమానితో కలిసి ఆలోచించసాగాడు.
అక్కడే ఉన్న “పెయింటర్” కారును అలాగే బయటకు తీసుకు వద్దాం! కారు టాప్ పైన కొన్ని గీతలు.. నొక్కులు పడితే తర్వాత సెట్ చేసుకోవచ్చు!! అని సలహా ఇచ్చాడు. “ప్రవేశ ద్వారం పగులగొట్టి కారు బయటకు తీసుకువద్దాం! తర్వాత ద్వారాన్ని రిపేర్ చేయిద్దాము! ” అని అసెంబ్లింగ్ అసిస్టెంట్ ఆ ఇంజనీరుకు సలహా ఇచ్చాడు.
ఈ రెండు సలహాలు విని యజమాని కన్విన్స్ కాలేక పోయాడు. ఎందుకంటే అలా కారుకు నొక్కులూ, గీతలు పడడం కానీ, ద్వారాన్ని పగలగొట్టడం కానీ మంచి శకునంగా అతడు భావించలేకపోయాడు. జరుగుతున్న విషయమంతా చూస్తున్న అక్కడే ఉన్న “వాచ్ మెన్ ” భయం భయంగా సందేహిస్తూనే తన మనసులోని ఐడియా చెప్పాలని ” ఒక చిన్న సలహా సార్! “అన్నాడు. అక్కడున్నవాళ్ళు ” నిపుణులే ఇవ్వలేని సలహాని వాచ్ మెన్ ఏమిస్తాడా? ” అని ఆశ్చర్యపోయి చూస్తూ ఉండగా..
Advertisements
Advertisement
ఆ వాచ్ మెన్ ఇలా అన్నాడు. కారును బయటకు తీసుకురావడం చాలా ఈజీ సార్! కారు, ద్వారం కన్నా ఒక ఇంచే ఎత్తు ఉందికదా సార్!!! కారు టైర్లలోని “గాలి” కొంత తీసేసి బయటకు తెచ్చి తిరిగి కారుటైర్లలో గాలినింపితే సరి!!” అన్నాడు. వాచ్ మెన్ సలహా విని అతన్ని అభినందిస్తూ అక్కడున్న ప్రతీ ఒక్కరూ చప్పట్లు కొట్టసాగారు.
కాబట్టి ,కేవలం నిపుణుల అభిప్రాయం తీసుకుని మాత్రమే సమస్యలను విశ్లేషించవద్దు!! ఒక్కోసారి చదువుకోని తాతనో, నానమ్మనో, అమ్మమ్మనో వంటి తాము సామాన్యంగా భావించే వ్యక్తులు కూడా… “ఎంతో కష్టం అని భావించిన సమస్యను అతి సులభంగా పరిష్కరించవచ్చు.!”
ఈ కథలో నేర్చుకోవలసిన మరో నీతి కూడా ఉంది.
Advertisements
మిత్రులతోనో, బంధువులతోనో.. గొడవ వల్లనో మరే కారణం వల్లనో అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు ఈ కథలోని కారులా మనం ఎత్తుగా (ఉన్నతంగా అనుకొని) వారి ఇంటి ప్రవేశ ద్వారం చిన్నగా ప్రవేశించలేనిదానిలా కనిపిస్తుంది. అప్పుడు ఈ కథలోని వాచ్ మెన్ సలహా పాటించాలి! కొంత గాలి (ఇగో) తీసివేసి..తగ్గి ఉండాలి.! ఎత్తును(ప్రవర్తనను) అడ్జెస్ట్ చేసుకోవాలి. నిజానికి మనమందరం ఆనంద స్వరూపమైన “ఆత్మ” గలవారము!! కానీ, “అనవసరమైనవి జమ చేస్తూ ఉంటే అశాంతితో బరువెక్కిపోతాము! ఈ చెత్తనంతా తొలగించుకుంటున్నకొద్దీ ఆనందంతో తేలికైపోతాము!
- సేకరణ : వాట్సాప్ మెసేజ్ నుండి
- రచయిత: సమాచారం లేదు