Advertisement
గృహప్రవేశానికి భార్య మైనపు బొమ్మ చేయించి పెట్టుకున్న వ్యక్తి గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది..అసలు ఆ బొమ్మ తయారు చేసిన ఆర్టిస్ట్ శ్రీధర్ కు మైనపు బొమ్మలు చేయాలనే ఆలోచన వచ్చిందే టుస్సాడ్స్ మ్యూజియాన్ని చూసిన తర్వాత.. అసలు ఏంటి టుస్సాడ్స్ మ్యూజియం ప్రత్యేకత.. ఆ మ్యూజియంలో ఉన్న మన దేశ సెలబ్రిటిల స్టాట్యూలేంటి చూద్దామా??
ఫ్రాన్స్ లో జన్మించిన అన్నా మారియా గ్రొష్జాల్… ఫ్రాంకోయిస్ టుస్సాడ్స్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని మేడమ్ టుస్సాడ్స్ గా మారింది.. చిన్నప్పటి నుండి మైనపు బొమ్మలు తయారు చేసే వ్యక్తి దగ్గర పెరిగిన టుస్సాడ్స్ కి వాటిని తయారు చేయడంపై ఆసక్తి కలిగింది..మెల్లిమెల్లిగా వ్యాక్స్ మోడలింగ్ పై పట్టు సాధించింది.. కేవలం ప్రముఖుల మైనపు విగ్రహాలను చేయడంపైనే దృష్టి పెట్టేది.. ప్రస్తుతం ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లో టుస్సాడ్స్ మ్యూజియాలు ఉన్నాయి.. లండన్ లోది ప్రముఖమైనది.. సింగపూర్,హాంకాంగ్..మనదేశంలోని ఢిల్లిలో కూడా ఈ మ్యూజియం ఏర్పాటు చేశారు..
టుస్సాడ్స్ లో చోటు దక్కించుకున్న సెలెబ్రిటీలు ..
అమితాబ్ బచ్చన్:
టుస్సాడ్స్ మ్యూజియంలో చోటు దక్కించుకున్న ఫస్ట్ ఇండియన్ సెలబ్రిటి అమితాబ్ బచ్చన్..భారత్ కి చెందిన మొదటి సెలబ్రిటి మాత్రమే కాదు ఆసియాకు చెందిన ఫస్ట్ పర్సన్ కూడా అమితాబ్ కావడం విశేషం.. 2000 సంవత్సరంలో లండన్లోని టుస్సాడ్స్ మ్యూజియంలో అమితాబ్ వ్యాక్స్ స్టాట్యూని ఏర్పాటు చేశారు..
Advertisements
ఐశ్వర్యరాయ్:
అమితాబ్ తర్వాత ఆ స్థానం దక్కించుకున్న మరో వ్యక్తి..తొలి హీరోయిన్ ఐశ్వర్య రాయ్ ..2004లో ఐశ్ వ్యాక్స్ స్టాట్యూని లండన్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు..2013లో మరో స్టాట్యూని న్యూయార్క్ మ్యూజియంలో పెట్టారు..కేన్స్ ఫెస్టివల్లో ఐష్ లుక్ ని పోలి ఉంటుంది ఈ స్టాట్యూ..
షారూక్ ఖాన్:
మూడవ వ్యక్తి షారూక్ ఖాన్.. 2007లో ఫస్ట్ స్టాట్యూ ఏర్పాటు చేయగా..ఇన్నేళ్లల్లో షారూక్ వి మూడు నాలుగు పైనే వ్యాక్స్ స్టాట్యూస్ ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోని మ్యూజియమ్స్ లో ఉన్నాయి.. ఢిల్లిలోని మ్యూజియంలో కూడా షారూక్ వ్యాక్స్ స్టాట్యూ ఉంది.
సల్మాన్ ఖాన్:
పీపుల్స్ మ్యాగజైన్ వాళ్లు నిర్వహించిన కాంటెస్ట్ లో మోస్ట్ హ్యాండ్సమ్ మాన్ గా పేరు సంపాదించుకున్నాడు సల్మాన్ ఖాన్.. ఆ తర్వాతే అంటే 2008లో టుస్సాడ్స్ మ్యూజియం వారు సల్మాన్ స్టాట్యూని ఏర్పాటు చేశారు.. 2012లో న్యూయార్క్ లోని మ్యూజియంలో మరో స్టాట్యూని నెలకొల్పారు.
హృతిక్ రోషన్:
ధూమ్ 2 చిత్రంలోని లుక్ తో హృతిక్ స్టాట్యూ ఉంటుంది.. ఈ స్టాట్యూ మోస్ట్ సెక్సీయస్ట్ మ్యాన్ గానే కాదు… మ్యూజియంలో ఏర్పాటు చేసిన స్టాట్యూలన్నింటిలోకి ఎక్కువ మంది కిస్ చేసిన స్టాట్యూగా కూడ పేరుగాంచింది.
Advertisement
కరీనా కపూర్:
ఐశ్వర్యరాయ్ తర్వాత స్థానం దక్కించుకున్న రెండవ నటి కరీనా కపూర్.. జబ్ వియ్ మెట్ సినిమాలోని పాత్ర రూపంలోని స్టాట్యూ సింగపూర్ లో ఏర్పాటు చేయగా, రెండవ స్టాట్యూని ఢిల్లిలో ఏర్పాటు చేశారు..ఇది రా.వన్ సినిమాలోని చమ్మక్ చల్లో పాటలో కరీనా గెటప్ ని పోలి ఉంటుంది.
మాధూరి దీక్షిత్:
లండన్ లోని టుస్సాడ్స్ మ్యూజియంలో చోటు దక్కంచుకుంది మాధూరి దీక్షిత్..తనది మరో ప్రతిమ ఢిల్లిలోని మ్యూజియంలో కూడా ఉంటుంది.
ప్రభాస్:
సౌతిండియా నుండి మొదటి స్థానం దక్కించుకున్న వ్యక్తి ప్రభాస్.. బాహుబలి సినిమాలోని ప్రభాస్ గెటప్ లోనే టుస్సాడ్స్ మ్యూజియంలో కూడా ప్రభాస్ స్టాట్యూ ఉంటుంది.
మహేశ్ బాబు:
ప్రభాస్ తర్వాత ఆ స్థానం దక్కించుకున్న రెండవ వ్యక్తి మహేశ్ బాబు.. ప్రిన్స్ స్టాట్యూ సింగపూర్ లోని టుస్సాడ్స్ మ్యూజియంలో ఉంది.
కాజల్ అగర్వాల్:
సౌతిండియా నుండి టుస్సాడ్స్ మ్యూజియంలో స్థానం దక్కించుకున్న ఫస్ట్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కావడం విశేషం..ఇప్పటివరకు మరే హీరోయిన్ కి ఆ స్థానం దక్కలేదు..
నరేంద్ర మోడి:
కేవలం సిని ప్రముఖులు మాత్రమే కాదు, రాజకీయ రంగం నుండి నరేంద్రమోడి టుస్సాడ్స్ మ్యూజియంలో స్థానం దక్కించుకున్నారు..2018లో లండన్లోని టుస్సాడ్ మ్యూజియంలో మోడి వ్యాక్స్ స్టాట్యూని ఏర్పాటు చేశారు.
వీళ్లే కాదు బాలివుడ్ కి చెందిన అనిల్ కపూర్,రన్ బీర్ కపూర్,వరుణ్ దావన్,దీపికా పదుకునే,కత్రినా కైఫ్ ఇలా మరికొందరి స్టాట్యూస్ కూడా ప్రపంచంలోని వివిద నగరాల్లో ఏర్పాటు చేసిన టుస్సాడ్స్ మ్యూజియమ్స్ లో ఉన్నాయి..ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన వ్యక్తుల స్టాట్యూలే టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసేవారు. టుస్సాడ్స్ మ్యూజియంలో స్థానం దక్కించుకోవడం అంటే ఒకప్పుడు చాలా గొప్పగా ఫీల్ అయ్యేవారు..ఇప్పుడు వారి మార్కెటింగ్ కోసం ఆయా దేశాల్లో పేరుగాంచిన వ్యక్తుల స్టాట్యూలను రూపొందిస్తుండడంతో కొంచెం విలువ తగ్గిందనే చెప్పవచ్చు..!
Advertisements