Advertisement
దేనికైనా శుభారంభం ఉండాలి అంటారు. కానీ నిద్రలేవడంతో ప్రారంభమయ్యే మనరోజులో మాత్రం మనం రెగ్యులర్ గా తప్పులు చేస్తూనే ఉంటుంటాం! ఇవన్నీ చిన్న చిన్న తప్పులే కానీ అవి మన పర్సనల్ లైఫ్ పై ఏదో ఒక రోజు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి! సో జనరల్ గా మనం చేసే 6 తప్పులను ఈరోజు నుండి మానేద్దాం!
1. స్నానం:
మనలో రెండు రకాలు …ఉదయం స్నానం చేసేవారు. సాయంత్రం స్నానం చేసేవారు.! ఉదయం స్నానం బెస్ట్. దీని వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది, రోజంతా యాక్టివ్ గా ఉంటాం! ఆఫీస్ పనుల్లో షార్ప్ గా ఉంటాం!
2. నీళ్లు:
ఉదయాన్నే చాలా మంది వేడి నీటి స్నానం చేయడానికి ఇష్టపడతారు. కానీ చల్లని నీటి స్నానమే బెస్ట్ . వేడి నీరు శరీరానికి రిలాక్సేషన్ ఇస్తుంది. దీంతో నిద్ర వస్తుంది. చన్నీళ్లు చేస్తే చర్మం పొడిగా మారకుండా ఉంటుంది. అలాగే రోజు ఉదయాన్నే చన్నీళ్లతో స్నానం చేస్తే ఏడాదికి 4 కిలోల వరకు బరువు తగ్గుతారని ఓ సర్వే.!
Advertisements
Advertisement
3. ఫోన్ వాడకం:
ఉదయం లేవగానే…వాట్సాప్ , ఫేస్ బుక్స్ చూడడం కంటే…..ఆహ్లాదకరమైన సంగీతం ఓ 5 నిమిషాలు వినడం ఉత్తమమట! సంగీతం వల్ల మనస్సు రిలాక్స్ అయ్యి…. ఏదో సాధించాలన్న కసి పెరుగుతుందట! రోజు సంగీతం వినడం మన ఆయుష్షును పెంచుతుందట!
4. బ్రేక్ ఫాస్ట్
ఉదయాన్నే ఫ్యాట్స్, ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. వీటి వల్ల శక్తి మెల్లిగా జెనరేట్ అయ్యి….అది లంచ్ వరకు శక్తినిస్తుంది ! కార్బోహైడ్రేడ్స్ తీసుకుంటే త్వరగా శక్తి రిలీజ్ అవుతుంది.దాన్ని ఉపయోగించని కారణంగా అది ఫ్యాట్ గా కన్వర్ట్ అయిపోతుంది!
5.ఛాయ్ – కాఫీ
బ్రష్ చేయడంతోనే ఖాళీ కడుపుతో టీ కాఫీలు తాగేస్తాం…అలా అలసే చేయకూడదు…నిద్ర లేచిన 4 గంటల తర్వాతే కాఫీ-టీలు తాగాలట! ఖాళీ కడుపుతో కాఫీ తాగితే గ్యాస్, అసిడిటీ సమస్యలు పెరుగుతాయి.
Advertisements
6. బెడ్
ఉదయం లేవగానే బెడ్ షీట్ ను దులిపి సర్దుకోవాలి.! సైకలాజికల్ గా నిద్రలేవగానే బెడ్ సద్దుకునే వాళ్ల…తన లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారట! వీరికి పనిని ఓ క్రమపద్దతిలో చేయడం అలవడుతుందట!