Advertisement
ఎప్పటి నుండో ఇక ముందు ముందు ఓటిటిలదే హవా అని చెప్పుకుంటుంటే.. కొరోనా పుణ్యమాని ఇప్పుడు అంతా ఒటిటిల మయం అయింది..టాప్ మూవీస్ కూడా ఒటిటిలలో రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి..సినిమాల గురించి పక్కన పెడితే తమ మార్క్ వెబ్ సిరీస్ లతో అలరిస్తున్నాయి ఒటిటిలు..కొన్ని వెబ్ సిరీస్లలో కొంచెం హాట్ హాట్ గా కనిపించాల్సి ఉంటుంది..అయినప్పటికి సినిమా అవకాశాలతో సంబంధం లేకుండా వెబ్ సిరీస్లలో ఛాన్స్ వస్తే వదులుకోవట్లేదు మన నటీనటులు.. అలాంటి కొందరు హీరోయిన్ల గురించి చూద్దాం..
రాధికా ఆప్టే
లెజెండ్ ,రక్త చరిత్ర సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న బెంగాలీ భామ రాధికా ఆప్టే..తర్వాత నెట్ ఫ్లిక్స్ వైపు మళ్లింది..మూవీస్లో యాక్ట్ చేస్తూనే వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిలింస్ లో కూడా నటిస్తుంది..రాధిక యాక్ట్ చేసిన లస్ట్ స్టోరీస్ నెట్ ఫ్లిక్స్ లో బాగా ఫేమస్ వెబ్ సిరీస్.. అదే విధంగా రాధిక “అహల్య” షార్ట్ ఫిలిం కూడా బాగుంటుంది..
Advertisements
రమ్యక్రిష్ణ
శివగామి.. వెండితెర సినిమాలతోనే కాదు.. జయలలిత జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన క్వీన్ తో వెబ్ సిరిస్లలో కూడా తన హవా కొనసాగిస్తుంది..వివిధ భాషల్లో రిలీజ్ అయిన ఈ సిరిస్ లో రమ్యక్రిష్ణ తన నటనతో అదరగొట్టింది. క్వీన్ 2 కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూసేలా చేసింది..
నిత్యామీనన్
మాధవన్ నటించిన బ్రీత్ వెబ్ సిరీస్ అమేజాన్ ప్రైమ్ లో సూపర్ హిట్ కాగా..బ్రీత్ సీజన్ 2 : ఇన్ టు ద షాడోస్ లో అభిషేక్ సరసన నటించింది.. ఈ సినిమాలో లిప్ లాక్ కూడా ట్రై చేసింది నిత్యా..అభిశేక్ తో కాదండోయ్..సహనటి శృతి భప్నా ని ముద్దుపెట్టుకుంది నిత్యా..
ప్రియమణి
ఫ్యామిలి మాన్ వెబ్ సిరీస్ లో మనోజ్ భాజ్ పాయ్ సరసన నటించింది నటి ప్రియమణి.. ఎలాగూ సినిమా అవకాశాలు అంతంత మాత్రమే.. దాంతో ప్రియమణికి ఈ అవకాశం బాగా కలిసొచ్చింది..
Advertisement
సమంతా..
ఫ్యామిలిమాన్ సీజన్ 2లో సమంతా నటించనుంది…కరోనా,లాక్ డౌన్ లేకపోయుండుంటే ఈ పాటికి రిలీజై ఉండేది.
మనీషా కొయిరాలా
లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ లో ఒక్కో అరగంట ఒక్కో స్టోరీ..అందులో ఒక స్టోరీలో మెయిన్ రోల్ పోషించింది మనీషా కొయిరాలా..
కైరా అద్వాని
భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి కైరా అద్వాని కూడా లస్ట్ స్టోరీస్ లో బోల్డ్ క్యారెక్టర్ లో నటించింది.
శ్వేతా బసు ప్రసాద్
కొత్త బంగారులోకం హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్..ఆ మధ్య ఒక కేస్ లో ఇరుక్కుని టాలివుడ్ కి దూరంగా వెళ్లిపోయి బాలివుడ్లో చంద్రకాంత సీరియల్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది.. తర్వాత తెలుగులో వచ్చిన మొదటి వెబ్ సిరీస్ గ్యాంగ్ స్టర్ లో నటించింది.. ఈ వెబ్ సిరీస్ లో జగపతిబాబు,నవదీప్ తదితరులు నటించారు.
ఆషా షైనీ
తెలుగు సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఆషా షైనీ తర్వాత కొంత కాలం మాయమైంది..ఇప్పుడు సడన్ గా వెబ్ సిరీస్ లలో యాక్ట్ చేస్తూ మళ్లీ ప్రత్యక్షమైంది..ముఖ్యంగా హాట్ స్టార్ రిలీజ్ చేసే సిరిస్లలో ఆషా నటిస్తుంది.
నక్షత్ర
“పలాస” సినిమా హీరోయిన్ నక్షత్ర నటించిన వెబ్ సిరీస్ “గీతా సుబ్రహ్మణ్యం-2020”
Advertisements