Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

బుధవారం బిగ్ బాస్ అప్డేట్!

Advertisement

ఇక బిగ్ బాస్ బుధవారం ఎపిసోడ్ విషయానికి వస్తే లాస్య,సుజాత నీతో మాట్లాడడానికి చాలా ఇబ్బందిగా ఉందని డైరెక్ట్ గా మోనాల్ తో చెప్పేశారు.దీనికి కారణం షిఫ్ట్ లు మారుతూ అఖిల్,అభిజిత్ లు నీకు బాడీ గార్డ్ లా వ్యవహారించడమేనని వారు అన్నారు..అలాగే తను ఏదో ఒక రూట్ మాత్రమే ఫిక్స్ అయితే బాగుంటుందని లేకపోతే మునుముందు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని లాస్య నవ్వుతూ మోనాల్ ను హెచ్చరించింది.

దీనిపై మోనాల్ తనకు తెలుగు రాదు కాబట్టి వారిద్దరి హెల్ప్ చేస్తున్నారని అంతకంటే మా మధ్య ఏం లేదని మోనాల్ క్లారిటీ ఇచ్చింది.

ఇక ఆతరువాత మైండ్ బ్లాక్ సాంగ్‌కి రెచ్చిపోయి డ్యాన్స్ లు వేసిన ఇంటి సభ్యులు ప్రేక్షకులను బాగా అలరించారు.ఈ పర్ఫామెన్స్ లో ముఖ్యంగా దేత్తడి హారిక, అరియానాలు చేసిన అందాల ప్రదర్శన షో చూస్తున్న కుర్రాళ్ళ మతులు పోగొట్టింది. ఆతరువాత అభిజిత్,మోనాల్ ముచ్చట్లు పెట్టిన టైంలో అఖిల్ దోశలు తీసుకొని వెళ్ళి మోనాల్ కిచ్చాడు.సరిగ్గా ఈ టైంలో మొనాల్‌కి పొరమారడంతో అభిజిత్ వాటర్ కోసం లేచి వెళ్లగా.. అఖిల్ తినడం ఆపేసి మరీ అభిజిత్ కంటే ముందు వెళ్లి వాటర్ అందించాడు.అభిజిత్ నువ్వు ఇస్తావా వాటర్ అని కౌంటర్ వేసిన, అఖిల్ దానికి పెద్దగా రియాక్ట్ అవ్వలేదు.

ఇక ఈ ఎపిసోడ్ అంతా అఖిల్,అభిజిత్,మోనాల్ చుట్టూనే తిరుగుతుంది.ఇక ఈ వ్యవహారం చూసిన వారంతా ముదిరి పాకాన పడుతున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ రానున్న ఎపిసోడ్స్ లో ఎలా ఉండబోతుందో బిగ్ బాస్ ఈ ఎపిసోడ్ లో ప్రోమో చూపించాడని అంటున్నారు.

Advertisement

తరువాత లగ్జరీ బడ్డెట్‌ టాస్క్ లో భాగంగా దేత్తడి హారిక-మొహబూబ్, మొనాల్-సొహైల్‌లు డ్యుయెట్స్ సాంగ్స్‌, అమ్మా రాజశేఖర్ మాస్టర్ సోలో పెర్ఫామెన్స్ చేసి అలరించాలని బిగ్ బాస్ ఆదేశించాడు.ఇక ఈ డాన్స్ షోకి జడ్జీలుగా లాస్య, నోయల్‌లు వ్యవహరించగా,ఈ షో యాంకర్‌గా అరియానా వ్యవహరించింది.ఇక మిగిలిన ఇంటి సభ్యులు షో మధ్యలో యాడ్ చేసి అలరించాల్సిన బాధ్యతలను చేపట్టారు..

Advertisements

అయితే మొనాల్‌‌-సొహైల్ డ్యూయెట్ కోసం చేస్తున్న డాన్స్ రిహార్సల్ కు అఖిల్ తెగ ఫీల్ అయిపోయాడు.దీనిపై లాస్య, అభిజిత్, సుజాతలు సెటైర్లు వేసుకున్నారు.డాన్స్ రిహార్సల్ పూర్తి అయ్యాక మోనాల్ అఖిల్‌తో వచ్చి కూర్చొని ముచ్చట్లు పెట్టింది.ఈ టైంలో మోనాల్ మన మధ్య ఏదో ఉందని అందరూ అనుకుంటున్నారని అఖిల్ తో చెప్పింది.దీంతో అఖిల్ వాళ్ళను పట్టించుకోకు అంటూ మొనాల్‌పై కోప్పడ్డాడు.

ఇక అఖిల్‌తో చర్చ సమావేశాలు ముగియగానే మోనాల్ అభిజిత్‌తో ఇంట్లో కొంత మంది మన ముందు ఒకలా తరువాత ఒకలా మాట్లాడుతున్నారని చెప్పి తెగ ఫీల్ అయ్యింది.

టాస్క్ లో భాగంగా సినిమా చూపిస్త మామా సాంగ్‌కి రాజశేఖర్ మాస్టర్,రచ్చ సినిమాలోని వానా వానా వెల్లువాయే సాంగ్‌కి మొనాల్‌, సొహైల్,టాప్ లేచిపెద్ది సాంగ్‌కి మొహబూబ్, హారిక వేసిన డ్యాన్స్ లు బాబోయ్ అని ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా ఇరగదీశారు.దానితో బుధవారం ఎపిసోడ్ ముగిసింది.

Advertisements

ఇక రేపటి ఎపిసోడ్‌లో మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండబోతుందని ప్రోమో చూపించారు.మరి ఆ ఎపిసోడ్ వివరాలేంటో వేచి చూద్దాం.