Advertisement
పుల్వామాలో భారత జవాన్లపై జరిగిన దాడికి ప్రతీకారంగా భారత్ బాలాకోట్‌పై దాడులు చేసి పాక్ ఉగ్రవా_ దులను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఆ దాడుల్లో ఎన్నో వందల మంది పాక్ ఉగ్రవాదులు మ_ రణించారు. అయితే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఆ దాడుల్లో పాల్గొని పాక్‌కు చెందిన ఓ ఎఫ్-16 ఫైటర్ జెట్‌ను కూల్చాడు. కానీ తన విమానంలో సాంకేతిక సమస్యలు రావడంతో పాకిస్థాన్‌లో అనుకోకుండా అతను దిగాల్సి వచ్చింది. అయితే అతను పాక్ చేతికి చిక్కినా భారత్ అడగడంతో అతన్ని విడిచిపెట్టారు. ఈ క్రమంలోనే అభినందన్ హీరో అయ్యాడు.
Advertisement
అయితే అప్పటి నుంచి అభినందన్ ఏమయ్యాడు ? అనే ప్రశ్న చాలా మందికి వస్తోంది. ఇంతకీ అసలు అభినందన్ ఏమయ్యాడు ? ఏం చేస్తున్నాడు ? అంటే.. అభినందన్ కు ఏమీ కాలేదు. అతను బాగానే ఉన్నాడు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో సీనియర్ పైలట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. యువతకు పైలట్లుగా శిక్షణ ఇస్తున్నాడు. వెస్టర్న్ సెక్టార్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
Advertisements
ఇక వింగ్ కమాండర్‌గా ఉన్న అభినందన్ 2021కు గ్రూప్ కెప్టెన్‌గా ప్రమోషన్ పొందనున్నాడు. అలాగే 2021లోనే సొంత యూనిట్‌కు అతను కమాండర్‌గా విధులు నిర్వర్తించనున్నాడు. ప్రస్తుతానికి అయితే అతను యువ పైలట్లకు ఫైటర్ జెట్లను నడపడంలో ట్రెయినింగ్ ఇస్తున్నాడు. కానీ అభినందన్ ఏమయ్యాడోనని సోషల్ మీడియాలో ఇప్పటికీ మనకు పోస్టులు కనిపిస్తున్నాయి. అయితే అతనికి ఏమీ కాలేదు. ఎప్పటిలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్నాడు.
Advertisements