Advertisement
పర్యావరణ పరిరక్షణ పేరిట ప్రతి ఏడాది దీపావళికి బాణసంచా కాల్చాలా, వద్దా అనే విషయం వివాదాస్పదమవుతూనే ఉంది. దీనిపై కొందరు కోర్టుల వరకు వెళ్తున్నారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో గత కొన్నేళ్లుగా దీపావళికి పటాకులను పేల్చడాన్ని నిషేధిస్తూ వస్తున్నారు. అయితే కరోనా నేపథ్యంలో నిపుణుల సూచన మేరకు ఈసారి అనేక రాష్ట్రాలు బాణసంచా కాల్చడాన్ని నిషేధించాయి. ఇక కొన్ని రాష్ట్రాల్లో అయితే నిర్ణీత సమయం పాటు కేవలం గ్రీన్ క్రాకర్స్ ను మాత్రమే కాల్చాలని రాష్ట్రాలు నిబంధనలు విధించాయి. అయితే సాధారణ బాణసంచా తెలుసు. కానీ ఇంతకీ అసలు గ్రీన్ ఫైర్ క్రాకర్స్ అంటే ఏమిటి ? వాటి ప్రత్యేకతలు ఏమిటంటే..?
గ్రీన్ ఫైర్ క్రాకర్స్ అంటే పర్యావరణానికి మేలు చేసేవన్నమాట. సాధారణ బాణసంచా లాగే వీటిని కూడా రసాయనాలతోనే తయారు చేస్తారు. కానీ గ్రీన్ క్రాకర్స్ ను కాల్చినప్పుడు సాధారణ బాణసంచా లాగా భారీ శబ్దాలు రావు, అలాగే పెద్ద ఎత్తున కాలుష్య కారకాలు విడుదల కావు. సాధారణ బాణసంచాను కాల్చితే వచ్చే కాలుష్య కారకాలతో పోలిస్తే గ్రీన్ క్రాకర్స్‌ను కాలిస్తే వచ్చే కాలుష్య కారకాల శాతం 30 శాతం వరకు తక్కువగా ఉంటుంది.
Advertisement
గ్రీన్ క్రాకర్స్ ను కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి (సీఎస్ఐఆర్) తయారు చేసింది. వీటిల్లోనూ సాధారణ బాణసంచా లాగే రసాయనాలను వాడుతారు. కానీ గ్రీన్ క్రాకర్స్ ను కాలిస్తే తక్కువ కాలుష్యం వస్తుంది. అలాగే తక్కువ శబ్దం వెలువడుతుంది. సాధారణ క్రాకర్స్ 160 డెసిబల్స్ శబ్దాలను విడుదల చేస్తాయి. గ్రీన్ క్రాకర్స్ అయితే 110 నుంచి 125 డెసిబల్స్ శబ్దం మాత్రమే విడుదల అవుతుంది. అందువల్ల శబ్ద కాలుష్యం ఉండదు.
Advertisements
Advertisements
గ్రీన్ క్రాకర్స్ ను తయారు చేయాలంటే తయారీదారులు సీఎస్ఐఆర్ అనుమతి తీసుకుని ఉండాలి. వారే ఆ ఫార్ములాను అందజేస్తారు. గ్రీన్ క్రాకర్స్‌లో SWAS, STAR, SAFAL అని మూడు రకాలు ఉన్నాయి. ఇక సాధారణ బాణసంచాలో మాదిరిగానే గ్రీన్ క్రాకర్స్‌లోనూ అల్యూమినియం, బేరియం, పొటాషియం నైట్రేట్, కార్బన్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. కానీ సాధారణ బాణసంచా కన్నా గ్రీన్ క్రాకర్స్ ద్వారా 30 శాతం కాలుష్యం తగ్గుతుంది. అందుకనే గ్రీన్ క్రాకర్స్ ను కాల్చాలని అనేక రాష్ట్రాలు నిబంధనలను విధించాయి. పర్యావరణ హితం కోసం మట్టి వినాయకులనే ప్రతిష్టించాలని చెబుతున్నట్లుగానే ఇప్పుడు గ్రీన్ ఫైర్ క్రాకర్స్ ను కాల్చాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు.