Advertisement
మన దేశం కన్నా అమెరికా, ఇంగ్లండ్, దుబాయ్ తదితర పలు దేశాలకు చెందిన కరెన్సీ విలువ ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అందువల్ల చాలా మంది ఆయా దేశాల్లో పని చేసేందుకు వెళ్లి డబ్బు సంపాదిస్తుంటారు. అయితే నిజానికి భారత కరెన్సీ కన్నా తక్కువ విలువ కలిగిన కరెన్సీ ఉన్న దేశాలు కూడా ఉన్నాయి. అవేమిటంటే…
1. శ్రీలంక : భారత కరెన్సీ 1 రూపాయి విలువ శ్రీలంక కరెన్సీ 2.53 రూపాయలకు సమానం.
2. భూటాన్: భూటాన్ కరెన్సీ విలువ భారత కరెన్సీకి సమానం. అంటే మన రూపాయి, వారి ఎన్‌గుల్‌ట్రుమ్‌కు సమానమన్నమాట. మన కరెన్సీని అక్కడ రూ.500 కన్నా ఎక్కువ మొత్తంలో ఖర్చు పెడితే తీసుకుంటారు.
Advertisements
3. నేపాల్ : మన రూపాయి పెడితే నేపాల్ కరెన్సీ రూ.1.60 వస్తుంది.
4. కంబోడియా : భారత కరెన్సీ రూ.1కి కంబోడియన్ రియెల్స్ 57 వస్తాయి.
Advertisement
5. ఇండోనేషియా : మన కరెన్సీ రూ.1కి ఇండోనేషియన్ రూపాయలు 190 వస్తాయి.
6. వియత్నాం : భారత రూ.1కి వియత్నాం డాంగ్స్ 323 వస్తాయి.
7. లావోస్ : భారత రూ.1కి 123 లొయేషియన్ కిప్స్ వస్తాయి.
8. మయన్మార్ : భారత రూ.1కి మయన్మార్ కయట్స్ 21 వస్తాయి.
9. లెబనాన్ : భారత రూ.1కి 20.68 లెబనీస్ పౌండ్లు వస్తాయి.
Advertisements