Advertisement
పరీక్షల్లో పాస్ అవ్వడం అంటే అనుకున్నంత ఈజీ కాదు. ఇక కొన్ని కష్టమైన పరీక్షల్లో పాస్ అవ్వాలి అంటే అదృష్టం రాసి పెట్టి ఉండాలి. ఎందరో కలలు గానే పరిక్షల విషయంలో పాస్ అవ్వడానికి పరీక్ష రాసే అభ్యర్ధులు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పరిక్షలు మన మెదడుకి సవాల్ చేస్తూ ఉంటాయి.
Also Read:రోహిత్ శర్మ భార్య చేతి వేళ్ళను ఎందుకు ముడుచుకుని కూర్చుంటుంది…? సచిన్ కు ఉన్న మూడ నమ్మకం ఏంటీ…?
పరీక్షల్లో ఉండే ప్రశ్నలను సాల్వ్ చేయడానికి ఒక్కోసారి మన మేధస్సు సరిపోదు. ఎంత ప్రిపేర్ అయినా సరే కొన్ని పరీక్షలు పాస్ కావడం అనేది కాస్త క్లిష్టమైన వ్యవహారమే. అలాంటి పరిక్షలు ఒక రెండు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. మాస్టర్ సోమెలియర్ డిప్లొమా పరీక్ష ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షగా చెప్తూ ఉంటారు. 40 సంవత్సరాల క్రితం యూకేలో లో పరీక్ష ప్రారంభమైనప్పటి నుండి 200 మంది మాత్రమే పాస్ అయ్యారు.
Advertisement
Advertisements
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని ఆల్ సోల్స్ కాలేజీకి ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్ష కూడా ఒకటి ఉంది. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని ఆల్ సోల్స్ కాలేజీకి ఫెలోషిప్ పరీక్షను ప్రపంచంలోనే కష్టతరమైన పరీక్షగా చెప్తూ ఉంటారు. ఈ పరిక్షలకు అభ్యర్ధులను పాస్ చేయడానికి ప్రత్యేక కోచింగ్ సెంటర్లు కోట్ల రూపాయలు కూడా వసూలు చేస్తున్నాయి. ఈ పరీక్ష కోసం ఏళ్ళ తరబడి చదివే వారు ఉన్నారు. ఇక మన సివిల్స్, జేఈఈ మెయిన్స్ గురించి తెలిసిందే.
Advertisements
Also Read:ఉమ్మడి ఏపీలో నటులు ఎక్కువగా ఆ ఊరి నుంచే ఎందుకు వచ్చారు…?