Advertisement
సాఫ్ట్ వేర్ ఉద్యోగం వినడానికి, చేయడానికి… వినసొంపుగా రాయల్టీగా బాగానే ఉంటది గాని మాస్టారూ… ఫ్యామిలీ విషయంలో జాగ్రత్త లేకపోతే మాత్రం బొమ్మ కనపడుతుంది. కుటుంబ కలహాలు ఎక్కువగా సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లోనే కనపడుతూ ఉంటాయి. సరే గాని సాఫ్ట్ వేర్ ఉద్యోగుల భార్యలు ఎదుర్కునే సమస్యలు ఏంటీ…?
Also Read:అసలు నూట పదహార్లు అనేది ఎలా వచ్చింది…?
భర్తలకి ఎప్పుడు పడితే అప్పుడు షిఫ్టూలు ఉండటంతో… ఎప్పుడు వెళ్లి ఎప్పుడు వస్తారో తెలీదు, వర్క్ ఫ్రం హోం అయినా సరే ఒకటే కాల్స్ తో భార్యతో మాట్లాడే టైం ఉండదు… భార్య ముద్దు పెట్టినా ముద్ద పెట్టినా మెంటల్ వస్తది. మీటింగ్స్ డెమోలు, కాల్స్ చికాకు పెడుతూ ఉంటాయి. ఎప్పుడు చూసినా సరే ఒకటే టెన్షన్. ఇంటి సమస్యలు పట్టించుకునే టైం ఉండదు, భార్యకు చీర, పిల్లలకు చొక్కా కొనే టైం ఉండదు.
Advertisement
Advertisements
వాళ్ళు ఏం చదువుతున్నారు, ఏం తిన్నారు, ఏం కోరుకుంటున్నారు ఇవేం ఉండదు. ఎప్పుడు ఏ దేశం వెళ్లాల్సి వస్తుందో తెలియక పిచ్చి ఎక్కుతుంది. దానికి తోడు ఆ వెళ్ళేది,లాంగ్ టర్మ్ ఓ- షార్ట్ టర్మ్ ఓ క్లారిటీ ఉండదు. ఒకవేళ భార్య భర్తతో వెళ్లలేకపోతే… ఏం చేయాలో తెలియదు. ఇక భార్యా భర్తలు సాఫ్ట్ వేర్ యితే పిల్లల బాధలు వినే వాళ్ళు ఉండరు. పిల్లల్ని ఎత్తుకునే వయసులో డే కేర్ లో పడేసి వీళ్ళకు టైం దొరికితే ఒక సినిమాకు రెస్టారెంట్ కు తీసుకెళ్ళి ఎంజాయ్ చేస్తారు.
Advertisements
Also Read:అసలు వైఫై కాలింగ్ అంటే ఏంటీ…?