Advertisement
మన దేశంలో కొన్ని కొన్ని వాస్తులు ప్రజలు ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి. అందులో ప్రధానంగా ఇంటి వాస్తు విషయంలో చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు కొందరు. ఇంటికి ఏ వైపు బరువు ఉండాలి… ఇంటి వెనుక గొయ్యి లేదా నుయ్యి ఉంటే మంచిదా కాదా అనే దాని మీద చాలా వరకు చర్చలు ఉంటాయి.
Also Read:రైల్వే ట్రాక్ పక్కన రాళ్ళు ఎందుకు ఉంటాయి…?
ఇక ఇంటికి ఈశాన్యం లో సెప్టిక్ ట్యాంక్ ఉండటంతో నష్టాలు ఏంటీ అనేది చాలా మంది తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు. దీని వల్ల కలిగే పరిణామాలు ఏంటి ? అనేది కాస్త ఆందోళన ఉంటుంది. చాలా మంది చెప్పే దాని ప్రకారం చూస్తే… ఆ విధంగా ఉండటం ఒక వాస్తు దోషమే. అది మీ స్వంత ఇల్లయితే ఒక వాస్తు పండితుడిని సంప్రదించి దక్షిణ దిక్కు గానో, నైరుతి లేక ఆగ్నేయ దిక్కుగా ఇంటి బయటకు మార్చడం మంచిది అని సూచిస్తున్నారు.
Advertisement
Advertisements
ఒకవేళ అద్దెకు ఉంటున్న ఇల్లయితే మారిపోవడం కూడా మంచిది అంటున్నారు. ఈశాన్య దిక్కులో ఇంటి బయట కానీ ఇంటి మీద కానీ సెప్టిక్ ట్యాంక్ ఉండటంవలన అనేక రకాల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయట. అనారోగ్యం, చికాకులు కలుగుతాయని హెచ్చరిస్తున్నారు. చాలా ఇళ్ళల్లో ఇటువంటి అనుభవాలు ఎదురయ్యాయి అని కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది అని సూచిస్తున్నారు. ఇల్లు మారే సమయంలో కూడా కాస్త వాస్తు చూసుకుని తీసుకుంటే మంచిది.
Advertisements
Also Read:సముద్రపు నీటిలో మంచి నీరు కలవదా…? ఏ నీళ్ళు బరువు ఎక్కువ…?